Family Star: ఫ్యామిలీ స్టార్‌పై ట్రోలింగ్.. మహేష్ బాబు సాంగ్‌ కాపీ కొట్టారా..?

ఈ సినిమా టీజర్‌లోని ఓ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీజర్లో విజయ్ దేవరకొండ దోశ వేసే షాట్ ఒకటి ఉంది. ఇక ఈ దోశను చూసిన తర్వాత.. ఇది నిజంగానే దోశేనా అనే డౌట్స్ రాక మానదు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఇదేం దోశ.. కొత్త రకం మిడిల్ క్లాస్ దోశనా అనే కామెంట్స్ వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 11:06 AMLast Updated on: Mar 15, 2024 | 11:09 AM

Vijay Devarakondas Family Star Movie Trolled On Social Media

Family Star: విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా గోవిందం కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యామిలీ స్టార్‌ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్‌, సాంగ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Samantha: నిజస్వరూపం.. సమంతపై లివర్ డాక్టర్ మండిపాటు

అయితే.. ఈ సినిమా టీజర్‌లోని ఓ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీజర్లో విజయ్ దేవరకొండ దోశ వేసే షాట్ ఒకటి ఉంది. ఇక ఈ దోశను చూసిన తర్వాత.. ఇది నిజంగానే దోశేనా అనే డౌట్స్ రాక మానదు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఇదేం దోశ.. కొత్త రకం మిడిల్ క్లాస్ దోశనా అనే కామెంట్స్ వచ్చాయి. దీంతో ఈ విషయంపై ఈ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించింది. ఏప్రిల్ 5వ తేదీన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుందని, అప్పుడు డౌట్లు క్లియర్ చేసుకోండని.. రిప్లై ఇచ్చింది. దీంతో దోశ మ్యాటర్ తేలాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా ఫ్యామిలీ స్టార్ నుంచి కళ్యాణి వచ్చా వచ్చా అనే సాంగ్ రిలీజ్ చేశారు.

గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే.. ఈ సాంగ్ కాపీ అంటూ ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. మహేష్‌ బాబు ఒక్కడు సినిమాలోని ఓ సాంగ్‌లా ఉందంటు రెండింటిని పక్క పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇది విన్న తర్వాత.. నిజమే కదా అనేలా ఉంది. కానీ ఫ్యామిలీ స్టార్ సాంగ్‌కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తోంది.