Kushi: పవన్ మూవీ టైటిల్ వాడుకున్నవిజయ్.. హిట్టు కొట్టాడా..?

పవన్ హిట్ మూవీ టైటిల్ వాడారు కాబట్టి ఖుషీ హిట్టే అనేంతగా ప్రచారం జరిగింది. పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కుతుందనుకున్నారు. కాని పవన్ బర్త్‌డేకి శివ నిర్వాణ చెత్త గిఫ్ట్ ఇచ్చాడనే కామెంట్ల జోరు పెరిగింది. ఆల్రెడీ లైగర్ ఫ్లాప్‌తో డీలా పడ్డ విజయ్ పరిస్థితి ఖుషీతో అయినా మెరుగవుతుందా అనుకుంటే, ఇది మరీ ఘోరం అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 1, 2023 | 07:54 PMLast Updated on: Sep 01, 2023 | 7:54 PM

Vijay Devarakondas Kushi Movie Is Hit Or Flop Here Is The Details

Kushi: పవర్ స్టార్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ ఖుషీ. ఈ హిట్ సినిమా టైటిల్‌ని వాడుకుని శివ నిర్వాణ రొమాంటిక్ డ్రామా తీశాడు. విజయ్, సమంతతో ప్రయోగం చేశాడు. ఇది ఎగ్జాక్ట్ గా పవన్ బర్త్‌డేకి ఒకరోజుముందు రిలీజైంది. వరల్డ్ వైడ్‌గా దుమ్ముదులుపుతుందనుకుంటే, ఫస్ట్ డేనే సీన్ రివర్స్ అయ్యింది. పవన్ హిట్ మూవీ టైటిల్ వాడారు కాబట్టి ఇది హిట్టే అనేంతగా ప్రచారం జరిగింది.

పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కుతుందనుకున్నారు. కాని పవన్ బర్త్‌డేకి శివ నిర్వాణ చెత్త గిఫ్ట్ ఇచ్చాడనే కామెంట్ల జోరు పెరిగింది. ఆల్రెడీ లైగర్ ఫ్లాప్‌తో డీలా పడ్డ విజయ్ పరిస్థితి ఖుషీతో అయినా మెరుగవుతుందా అనుకుంటే, ఇది మరీ ఘోరం అంటున్నారు. మణిరత్నం ఫ్యాన్ అయిన డైరెక్టర్ శివ నిర్వాణ మొదట్నుంచి మణి పాత హిట్ల కథలతోనే బండి నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు సఖి మూవీ కథకి, బొంబాయి మూవీలోని మతాల బ్యాక్‌డ్రాప్ తీసుకుని, మళ్లీ అదంతా ఉత్తిదే అని చెప్పి బ్రహ్మిణ్ వర్సెస్ ఎథిస్ట్ అంటూ దేవుడిని నమ్మే వాళ్లు, నమ్మని వాల్ల మద్య కథని చెప్పబోయాడు.

ఓ సోధి కథకి ఏవేవో డెకరేషన్లు చేసి, మసి పూసి మారేడు కాయచేయబోతే టాక్ షాక్ ఇస్తోంది. నిజంగా విజయ్, సమంత పెర్ఫామెన్స్, మ్యూజిక్ ఇలా అన్నీ బాగున్నా, శివ నిర్వాణ నిర్వాకమే సున్నా అనాల్సి వచ్చేలా ఉంది. సంఘర్షణ లేని కథతో బాక్సాఫీస్ భజన కష్టం అని తేలింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే టైంలో తన హిట్ మూవీ టైటిల్ ఇలా బాక్సాఫీస్ బ్యాటిల్‌లో ఓడిపోయింది.