Vijay Devarakonda: అండర్ కవర్ రౌడీ.. కెరీర్‌లో ఫస్ట్ టైం భారీ రీస్క్ చేస్తున్న విజయ్..!
ఖుషీ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేయబోతున్న మూవీ ఓ పోలిస్ స్టోరీ అని అనుకున్నారు. పోస్టర్ వచ్చినప్పటి నుంచి కాప్‌గా మారబోతున్న విజయ్ అనే ప్రచారం జరిగింది. ఐతే పోస్టర్లో హీరో ముఖం క్లాత్‌తో దాచిపెట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు లీకైంది.
Vijay Devarakonda: ఇప్పటి వరకు అండర్ కవర్ కాప్ విన్నాం. పోకిరిలో చూశాం. కాని ఫస్ట్ టైం అండర్ కవర్ డాన్‌ని చూడబోతున్నాం. అదే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త మూవీతో చేస్తున్న ప్రయోగం. నిజంగానే ఖుషీ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేయబోతున్న మూవీ ఓ పోలిస్ స్టోరీ అని అనుకున్నారు. పోస్టర్ వచ్చినప్పటి నుంచి కాప్‌గా మారబోతున్న విజయ్ అనే ప్రచారం జరిగింది. ఐతే పోస్టర్లో హీరో ముఖం క్లాత్‌తో దాచిపెట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు లీకైంది.
బేసిగ్గా డాన్ అయిన హీరో తన ఐడెంటీటీని కాపాడుకుంటూ, పోలీసుల్లో ఒకడిగా ఉంటూనే తన వ్యాపార సామ్రాజ్యం ఎలా పెంచుకున్నాడు.. తన ఫ్యామిలీని అంతం చేసిన వాళ్ల మీద పగ ఎలా తీర్చుకున్నాడనే కోణంలో సినిమా తెరకెక్కుతుందట. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సురేందర్ రెడ్డి తీసిన మూవీ అతిథిలో విలన్ పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. అందులో పోలీసే విలన్. కాని బయటివారికి పోలీస్‌గా కనిపిస్తాడు. అచ్చంగా ఇదే పాత్ర విలన్‌గా కాకుండా హీరోగా మారిస్తే ఎలా ఉంటుందో.. అదే విజయ్‌తో గౌతమ్ తిన్ననూరి తీసే సినిమా అంటున్నారు. హాలీవుడ్ మూవీ డీపార్టెడ్‌ని బేస్ చేసుకుని తెలుగులో హోమం తీస్తే, ఇప్పుడు ఇదే పాయింట్‌ని కొత్తగా.. సరికొత్తగా మలచబోతున్నాడట గౌతమ్ తిన్ననూరి.