Vijay Devarkonda: రౌడీ వద్దన్నాడా..? ఆ సినిమా ఆగిపోయిందా..?
జెర్సీతో సౌత్‌లో హిట్ కొట్టి, హిందీలో మాత్రం ఫ్లాప్ ఫేస్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. తర్వాత రామ్ చరణ్‌తో ఓ మూవీ ప్లాన్ చేశాడు. కానీ, అది ఆగిపోయింది. తర్వాత విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతే ఈలోపే ఫ్యామిలీ స్టార్ సినిమా మొదలై పూర్తవ్వొచ్చింది.

Vijay Devarkonda: విజయ్ దేవర కొండ తన కొత్త సినిమాను ఆపేశాడట. గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ కమిటైన ప్రాజెక్ట్ దాదాపు అటకెక్కేలా ఉంది. జెర్సీతో సౌత్‌లో హిట్ కొట్టి, హిందీలో మాత్రం ఫ్లాప్ ఫేస్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. తర్వాత రామ్ చరణ్‌తో ఓ మూవీ ప్లాన్ చేశాడు.
PAWAN KALYAN: పవన్ పాట పాడితే.. పవర్ ఫుల్ కిక్కే..
కానీ, అది ఆగిపోయింది. తర్వాత విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతే ఈలోపే ఫ్యామిలీ స్టార్ సినిమా మొదలై పూర్తవ్వొచ్చింది. ఆ తర్వాత సమ్మర్‌లో VD12 వర్కింగ్ టైటిల్‌తో విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ పైకెళుతుందనుకుంటే ఈలోపే ఆగిపోయిందన్నారు. ఫిల్మ్ టీం జోక్యం చేసుకుని అవన్నీ వట్టి పుకార్లే అని తేల్చారు. రూమర్స్‌ని ఖండించారు. కాని నో యూజ్. గౌతమ్ తిన్ననూరి మూవీని విజయ్ ఆపేయమన్నట్టుగా మాత్రం మ్యాటర్ లీకైంది.
పూరీ, శివ నిర్వాణ ఇద్దరూ తనకి లైగర్, ఖుషీ లాంటి ఫ్లాపులతో మోసం చేయటంతో విజయ్‌కి మనసు విరిగిందంటున్నారు. రిస్క్ వద్దనే గౌతమ్ తిన్ననూరి స్పై మూవీకి దండం పెట్టేశాడట.