విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్ళీ దొరికిపోయారుగా.. ముంబైలోని ఆ హోటల్లో..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారనే విషయం చాలా కాలంగా తెలుసు. కాకపోతే తమ ప్రేమ విషయాన్ని వాళ్ళు అధికారికంగా బయట పెట్టలేదు అంతే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2025 | 11:30 AMLast Updated on: Apr 02, 2025 | 11:30 AM

Vijay Deverakonda And Rashmika Mandanna Have Been Found Again In That Hotel In Mumbai

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారనే విషయం చాలా కాలంగా తెలుసు. కాకపోతే తమ ప్రేమ విషయాన్ని వాళ్ళు అధికారికంగా బయట పెట్టలేదు అంతే. పైగా ఇద్దరు ఇప్పుడు ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పెళ్లి వైపు అడుగులు వేస్తే కెరీర్ దెబ్బతింటుంది అనేది ఇద్దరి ఆలోచన. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. టైం దొరికినప్పుడల్లా డేటింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇద్దరూ కలిసి బయటికి వెళ్తుంటారు.. దాన్ని చాలావరకు దాచాలి అని ప్రయత్నిస్తుంటారు కానీ ఈజీగా ఇట్టే దొరికిపోతుంటారు. తాజాగా మరోసారి ఈ జంట మీడియాకు కనిపించింది. ముంబైలో ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న మార్చి 30న సికిందర్ విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండకు లంచ్ పార్టీ ఇచ్చింది రష్మిక. ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో ఇద్దరు కలిసి కనిపించారు. తెల్ల రంగు పూల చొక్కాలో విజయ్ కనిపిస్తే.. రెగ్యులర్ ట్రెండి కాస్ట్యూమ్ లో రష్మిక కనిపించింది. ఇద్దరినీ మీడియా పలకరించడానికి ప్రయత్నించినా కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత రాహుల్ సంక్రిత్యన్, రవి కిరణ్ కోలా సినిమాలు లైన్లో ఉన్నాయి. మరోవైపు రష్మిక పూర్తిగా ముంబైలోనే ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలన్నీ హిందీలోనే ఉన్నాయి కాబట్టి అక్కడే సెటిల్ అయిపోయింది. ఎప్పుడైనా రష్మికను కలవాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తుంటాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు కూడా ఇదే చేశాడు రౌడీ హీరో. షూటింగ్ లో చిన్న గ్యాప్ దొరకడంతో.. రష్మికతో కలిసి బయటికి వెళ్ళాడు. ముంబైలో వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో మరోసారి ఇద్దరు ట్రెండ్ అవుతున్నారు. ఇక రష్మిక కూడా హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా స్ట్రైట్ గా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన సాక్షాలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. అంతేకాదు విజయ్ కుటుంబంతో పాటు ఎప్పుడైనా వెకేషన్ వెళ్లినప్పుడు.. అందులో రష్మిక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏ బ్యాక్ గ్రౌండ్ తో అయితే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడతాడో.. కొన్ని గంటల తర్వాత సేమ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రష్మిక కూడా ఫోటో అప్లోడ్ చేస్తుంది. దాన్నిబట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అనే విషయం అర్థం అయిపోతుంది. ఇలా చాలా సార్లు జరిగింది. కాకపోతే దాగుడు మూతలు ఆడుతున్నారు అంతే.

తాము లవ్ లో ఉన్నామనే విషయంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హింట్ ఇస్తూనే ఉంటారు ఈ జంట. అడిగితే మాత్రం నో కామెంట్స్ అంటారు. వీళ్ళ ప్రేమ కథ త్వరలోనే క్లైమాక్స్ కు వచ్చేలా కనిపిస్తుంది. ప్రస్తుతం కెరీర్లో చాలా బిజీగా ఉండడంతో.. ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇరు కుటుంబాలు ఈ పెళ్లి గురించి త్వరలోనే మాట్లాడనున్నారు. ప్రస్తుతం రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. యానిమల్, పుష్ప, ఛావా లాంటి సినిమాలతో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ టైంలో వీళ్లిద్దరికి పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు. అందుకే ప్రస్తుతం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లెక్కన 2026 లేదంటే 2027 లో విజయ్ రష్మిక పెళ్లి జరగడం ఖాయం. అన్నట్టు కెరీర్ మొదట్లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక.