Vijay Deverakonda: విజయ్ ఇంట్లో మోగనున్న వెడ్డింగ్ బెల్స్..!
2025 దసరా తర్వాత రౌడీ లైఫ్‌లోకి వైఫ్ రాబోతోంది. ఇంట్లో ఆల్‌మోస్ట్ అంతా ఓకే చేశారు. తనకి కాబోయే వైఫ్ ఇంట్లో కూడా అంతా ఓకే అనేశారు. ఇక వధువెవరో తేలటమే బాకీ. అంతా అనుకున్నట్టే రష్మికే తనకు కాబోయే వైఫ్ అనే మాటే నిజమయ్యేలా ఉంది.
Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటుగా ఆచరించినా, పర్ఫెక్ట్‌గా అనుకున్న మాటని, ఆలోచనని ఆచరిస్తాడు. ఆ మధ్య ఖుషీ సక్సెస్ తర్వాత రూ.కోటిని తన ఫ్యాన్స్‌కి పంచిపెడతానని మాటమీద నిలబడ్డ రౌడీ.. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా మాటని నిజం చేయబోతున్నాడు. రానున్న రెండేళ్లలో తను కూడా ఓ ఇంటివాడవుతానన్నాడు. ఆ రెండేళ్ళలో తన పెల్లెప్పుడో మాత్రం ఇప్పుడు తేలింది. 2025 దసరా తర్వాత రౌడీ లైఫ్‌లోకి వైఫ్ రాబోతోంది. ఇంట్లో ఆల్‌మోస్ట్ అంతా ఓకే చేశారు.
తనకి కాబోయే వైఫ్ ఇంట్లో కూడా అంతా ఓకే అనేశారు. ఇక వధువెవరో తేలటమే బాకీ. అంతా అనుకున్నట్టే రష్మికే తనకు కాబోయే వైఫ్ అనే మాటే నిజమయ్యేలా ఉంది. ఈ విషయమే దసరాకు రౌడీ ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాడట. అలా ఈ దసరాకి తన పెళ్లి కబురు చెప్పి.. వచ్చే దసరా తర్వాత పెళ్లి బాజాలకు సిద్దపడుతున్నాడట రౌడీస్టార్ విజయ్ దేవరకొండ. ఈ చర్చ ఈ మధ్యే మళ్లీ జరగటంతో, మెల్లిగా మ్యాటర్ బయటికి పొక్కుతోంది. ఏదేమైనా ఫిల్మ్ నగర్లో వచ్చే గుసగుసల్లో ఎక్కువ శాతం రౌడీ తాలూకు గుసగుసలే నిజమౌతున్నాయి.