Vijay Deverakonda : ‘సలార్ 2’లో విజయ్ దేవరకొండ…
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని రీసెంట్ గా వార్తలొస్తున్నాయి.

Vijay Deverakonda in 'Salar 2'...
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని రీసెంట్ గా వార్తలొస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్.. విజయ్ (Vijay) ని కలవడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా రానుందన్న వార్తల్లో నిజం లేదని.. అటు నీల్ టీం, ఇటు విజయ్ టీం చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
గతేడాది చివరిలో ప్రభాస్ తో చేసిన ‘సలార్’ చిత్రంతో ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘సలార్-2’ (Salaar 2) తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. అయితే సెకండ్ పార్ట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుందట. నిడివి తక్కువ అయినప్పటికీ, అది కథని మలుపు తిప్పే పాత్ర అని సమాచారం.
అందుకే ఆ రోల్ కోసం నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్న యంగ్ హీరోని రంగంలోకి దింపాలని భావించిన నీల్.. విజయ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర గురించి చర్చించడం కోసమే విజయ్ ని నీల్ కలిశాడని, ఈ రోల్ చేయడానికి విజయ్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా గతంలో ‘సలార్ 2’లో అక్కినేని అఖిల్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. మరి అఖిల్ స్థానంలో విజయ్ నటిస్తాడా లేక ఇద్దరివీ వేరు వేరు పాత్రలా వంటి విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.