నాన్నకు ప్రేమతో సినిమా మళ్లీ చూపిస్తున్న విజయ్ దేవరకొండ.. ఎందుకో తెలుసా..?

నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది కదా..! టైగర్ ఎన్టీఆర్ అంత అద్భుతంగా నటించాడు.. మళ్లీ ఈ సినిమా విజయ్ దేవరకొండ చూపించడం ఏంటి అనుకుంటున్నారు కదా..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2025 | 04:50 PMLast Updated on: Mar 07, 2025 | 4:50 PM

Vijay Deverakonda Is Re Showing Do You Know Why The Movie Nanna Ku Prematho Do

నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది కదా..! టైగర్ ఎన్టీఆర్ అంత అద్భుతంగా నటించాడు.. మళ్లీ ఈ సినిమా విజయ్ దేవరకొండ చూపించడం ఏంటి అనుకుంటున్నారు కదా..! ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇలాంటి వింతలు జరుగుతూ ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయన కూడా నాన్నకు ప్రేమతో సినిమా మళ్లీ మళ్లీ చూపిస్తున్నాడు. ఇంక చాలు బాబు అని ఆడియన్స్ అంటున్నా కూడా.. తగ్గేదే లేదు మీరు చూడాల్సిందే అంటున్నాడు. ఇంతకీ ఏ విషయంలో విజయ్ దేవరకొండ నాన్నకు ప్రేమతో సినిమా చూపిస్తున్నాడు అని తెలియాలంటే మీకు ఈ స్టోరీ మొత్తం తెలియాలి. ఈ కథ ఇప్పుడు మొదలైంది కాదు.. సరిగ్గా ఏడాది కింద ఫ్యామిలీ స్టార్ సమయంలో మొదలైంది.

ఇప్పుడు మళ్లీ ఆ సినిమా గురించి ఎందుకు.. విజయ్ కెరీర్‌ను ముంచిన సినిమాల్లో అది ముందు వరసలో ఉంటుంది కదా అనుకోవచ్చు.. కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ నాన్నకు ప్రేమతో కథకు.. ఫ్యామిలీ స్టార్ సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. అసలు విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్ డమ్ మే 30న విడుదల కానుంది. దీని తర్వాత రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. దాదాపు 300 ఏళ్ల నాటి కథ ఇది. దీనికోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇక దీని తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా నిర్మిస్తున్నాడు. దీని షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలు కానుంది. ఇందులోనే నాన్నకు ప్రేమతో సినిమా ఉంది.

అదెలా అంటే.. ఈ సినిమా టైటిల్ రౌడీ జనార్ధన్ అని కన్ఫర్మ్ చేశాడు దిల్ రాజు. విజయ్ దేవరకొండ నాన్నగారి పేరు జనార్ధన్. పైగా విజయ్ కి వాళ్ళ నాన్న అంటే ప్రాణం. ఏదో ఒక సినిమాకు నాన్న పేరు పెట్టుకుంటే నాన్నకు ప్రేమతో సినిమా అయిపోతుందా అనుకోవచ్చు..! ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు జనార్ధనే. దర్శకుడు పరశురామ్ ను అడిగిమరీ ఈ క్యారెక్టర్‌కు తన తండ్రి పేరు పెట్టించాడు విజయ్. దానికి కారణం.. తమ చిన్నపుడు నాన్న పడిన కష్టాలు తాము కళ్లారా చూసామని.. కుటుంబాన్ని పోషించడానికి ఆయనెంతో కృషి చేసాడని.. అందుకే నాన్న పేరు పెట్టి ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు విజయ్ దేవరకొండ. అప్పుడంటే ఓకే గానీ ఇప్పుడు కూడా మరోసారి నాన్న పేరుతోనే సినిమా చేస్తున్నాడు రౌడీ హీరో. రాహుల్ సినిమాకు రౌడీ జనార్ధన్ టైటిల్ బాగానే పాపులర్ అవుతుంది. చూస్తుంటే దిల్ రాజు ఈ టైటిల్‌ను కావాలనే లీక్ చేసినట్లు అర్థమవుతుంది. మరి విజయ్ చూపిస్తున్న ఈ నాన్నకు ప్రేమతో సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలిక.