Vijay Deverakonda : విజయ్ దేవరకొండ మాస్ అవతార్.
ఇటీవల 'ఫ్యామిలీ స్టార్' (Family Star) తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. తన తదుపరి సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

Vijay Deverakonda Mass Avatar.
ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. తన తదుపరి సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత విజయ్ చేయబోయే మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు.
కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన ‘రాజా వారు రాణి గారు’ (Raja Varu Rani Garu) చిత్రంతో రవికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2019 లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత కిరణ్ హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే.. రవికిరణ్ (Ravi Kiran) మాత్రం ఐదేళ్లు అవుతున్నా దర్శకుడిగా తన రెండో సినిమా చేయలేదు. మధ్యలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి మాత్రం రచయితగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. అయితే లేట్ గా అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా.. దర్శకుడిగా తన రెండో సినిమాని విజయ్ తో చేస్తున్నాడు.
నిజానికి దర్శకుడిగా రవికిరణ్ రెండో సినిమా ప్రకటన గతేడాది సెప్టెంబర్ లోనే వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju), శిరీష్ (Sirish) నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సమయంలో ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్ దేవరకొండ పేరు వచ్చేలా ‘VD’ అని హింట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.59వ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా మే 9న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.