Vijay Deverakonda: అర్జున్ రెడ్డి.. ఇక నుంచి సమర సింహారెడ్డి!
టాక్సీవాలా మూవీ తీసిన రాహుల్ సంకృత్యన్ రౌడీ స్టార్‌తో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో మూవీ తీస్తున్నాడట. అది కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో అని తెలుస్తోంది. అసలే శ్యామ్ సింగరాయ్ అంటూ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రాహుల్ తీసిన మూవీ బ్లాక్‌బస్టరైంది.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు రౌడీ స్టార్‌గానే తెలుసు. అర్జున్ రెడ్డిగానే అందరికి దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డినే సడన్‌గా సమర సింహారెడ్డిగా మారుతున్నాడు. ఇంద్రసేనా రెడ్డిగా కత్తి తిప్పబోతున్నాడు. వీరసింహారెడ్డిగా వణికించబోతున్నాడు. సమరసింహా రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి లాంటి పాత్రల్లో విషయ్ దేవరకొండని ఊహించగలమా? కాని అదే జరగబోతోంది.
టాక్సీవాలా మూవీ తీసిన రాహుల్ సంకృత్యన్ రౌడీ స్టార్‌తో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో మూవీ తీస్తున్నాడట. అది కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో అని తెలుస్తోంది. అసలే శ్యామ్ సింగరాయ్ అంటూ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రాహుల్ తీసిన మూవీ బ్లాక్‌బస్టరైంది. నానికి హిట్ ఇచ్చినట్టే విజయ్‌కి టాక్సీవాలాలో ముందుగా హిట్ ఇచ్చాడు ఈ దర్శకుడు. అలాంటి తను, సడన్‌గా ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్‌తో.. అది కూడా విజయ్‌తో సినిమా తీయాలనుకోవటమే ఇక్కడ విచిత్రం. మరి ఈ ప్రయోగం ఎలా ఉంటుందో కాని, అర్జున్ రెడ్డి సడన్‌గా సమరసింహా రెడ్డి స్టైల్లో పంచ్ డైలాగ్స్ విసిరితే మాత్రం విచిత్రంగానే ఉంటుంది.