Vijay rashmika Engagement : విజయ్ దేవరకొండ – రష్మికల ఎంగేజ్ మెంట్? క్లారిటీ ఇచ్చేసిన రౌడీ హీరో..
సినీ పరిశ్రమ (Film Industry)లో రూమర్స్ కామన్.. కొంతమంది విషయంలో అయితే ఈ రూమర్స్ కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో రౌడీ హీరో (Rowdy hero) విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మికల గురించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి.

Vijay Deverakonda - Rashmikala Engagement? The rowdy hero who gave clarity..
సినీ పరిశ్రమ (Film Industry)లో రూమర్స్ కామన్.. కొంతమంది విషయంలో అయితే ఈ రూమర్స్ కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో రౌడీ హీరో (Rowdy hero) విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మికల గురించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. కొద్దికాలం నుంచి విజయ్ రష్మికతో ప్రేమలో ఉన్నాడని, ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీనికితోడు, వీరిద్దరూ కలిసి అకేషన్ కోసం వెళ్లారని, రెస్టారెంట్ లో కలుసుకున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ వాటినుంచి ఇరువైపులా ఎవరూ ఖండించలేదు. దీంతో అభిమానులంతా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటాడంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఫిబ్రవరిలో వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి టైమ్‌లో రౌడీ బాయ్ విజయ్.. రష్మికతో తన రిలేషన్, ఎంగేజ్‌మెంట్ గురించి గుట్టు విప్పాడు. తమిద్దరి విషయంలో వస్తున్న రూమర్స్‌ను ఖండించాడు.
‘లైఫ్ స్టైల్ ఆసియా’ (Lifestyle Asia) అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన విజయ్.. అనంతరం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో తనకు ఎలాంటి పెళ్లి, నిశ్చితార్థం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ మీడియా నాకు ప్రతి ఏడాది పెళ్లి చేయాలని చూస్తుంటుంది. ఇదే రూమర్ నేను ప్రతి ఏడాది వింటూనే ఉన్నాను. నన్ను పట్టుకుని, నాకు పెళ్లి చేయాలని చూస్తుందేమో ఈ మీడియా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ ఇచ్చిన ఈ క్లారిఫికేషన్‌తో ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లయింది.
విజయ్ – రష్మిక (Vijay rashmika) కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. తరచూ ఇద్దరూ కలుస్తూ ఉంటారు. విజయ్ ఇంటికి రష్మిక మందన్నా వస్తుంటుంది. వాళ్ల ఇంట్లోనే పండగలు సెలబ్రేట్ చేసుకుంటుంది. దీంతో.. ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఇకపోతే ప్రస్తుతం రష్మిక, విజయ్ వారి వారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. రష్మిక ప్రస్తుతం అనిమల్ పార్క్, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2 సినిమాలతో బిజీగా ఉండగా .. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు.