Vijay Deverakonda: ఎక్కడో ఉండాల్సిన విజయ్ ఎక్కడికో వెళ్తున్నాడా..?

మొన్నే ఖుషీ అంటూ శివనిర్వాణ లాంటి డైరెక్టర్‌తో చేయకూడని ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు విజయ్. ఇదంతా లైగర్ పుణ్యమే. లైగర్‌కి ముందే ఖుషీ కథ విన్న విజయ్, దాన్ని కాదని లైగర్ చేశాడు. అది పాన్ ఇండియా లెవల్లో తనని ఫోకస్ చేస్తుందనుకుంటే, ఎక్కడో ఉండాల్సినోడిని ఎక్కడికో లాక్కెల్లింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 07:01 PMLast Updated on: Sep 26, 2023 | 7:01 PM

Vijay Deverakonda Signs A Film Under Dil Raju Productions With

Vijay Deverakonda: అర్జున్ రెడ్డితో ఆకాశమంత ఎత్తు ఎదిగిన విజయ్.. ఇప్పుడు రాజావారు.. రాణీగారు.. అంటూ చిన్న ప్రయోగం చేసిన దర్శకుడితో సినిమా చేయాల్సి వస్తోంది. అది ఇష్టంగా ఒప్పుకున్నాడా..? దిల్ రాజు చెప్పాడని కష్టంగా తలఊపాడా అర్ధం కాని పరిస్థితి అంటూ కామెంట్లు పెరిగాయి. మొన్నే ఖుషీ అంటూ శివనిర్వాణ లాంటి డైరెక్టర్‌తో చేయకూడని ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు విజయ్. ఇదంతా లైగర్ పుణ్యమే. లైగర్‌కి ముందే ఖుషీ కథ విన్న విజయ్, దాన్ని కాదని లైగర్ చేశాడు.

అది పాన్ ఇండియా లెవల్లో తనని ఫోకస్ చేస్తుందనుకుంటే, ఎక్కడో ఉండాల్సినోడిని ఎక్కడికో లాక్కెల్లింది. సరే పంచ్ పడింది కదాని, వీక్ మూమెంట్‌లో శివ నిర్వాణ కథకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తప్పు చేశాడు. ఇప్పుడీ రిజల్ట్‌తో డీలా పడ్డాడు. ఎంతో టాలెంట్‌తో పాటు దేశవ్యాప్తంగా యూత్‌లో క్రేజ్ ఉన్నా, అర్జున్ రెడ్డి టైంలో మెడికల్ స్టూడెంట్స్ ఈ హీరో కోసం రోడ్ల మీద ఫ్లయింగ్ కిస్సులిస్తూ పరుగులు తీసినా.. చివరికి రౌడీ పొజీషన్ ఊహించిన దానికి భిన్నంగా ఉంది. అంతా దర్శకులు చేసిన తప్పులే అన్నారు.

కారణం ఏదైతే ఏం బన్నీ, చరణ్, తారక్ కంటే ముందే ప్రభాస్ తర్వాత మరో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాల్సిన రౌడీ.. చివరికి దిల్ రాజు చెప్పాడని ఓ చిన్న ప్రయోగాల దర్శకుడి కథకి ఓకే చేప్పాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఎక్కడో ఉండాల్సిన విజయ్ ఎక్కడికో వెళ్తున్నాడు అంటున్నారు మూవీ లవర్స్.