Vijay Deverakonda: ఫ్యాన్స్‌ని కదిలిస్తోన్న విజయ్ దేవరకొండ..!
ఖుషీ సక్సెస్‌ని తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటానన్న మాట నిలబెట్టుకున్నాడు విజయ్. నిజంగానే ఫ్యాన్స్‌ని తన ఫ్యామిలీ మెంబర్స్‌లా ఫీల్ అవుతాడు కాబట్టే.. చెప్పినట్టుగానే కోటి రూపాయలను వందమందికి పంచుతానన్న మాట నిజం చేస్తున్నాడు.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రెబల్‌లా మాట్లాడుతాడు. మనసులో ఉన్నది ఉన్నట్టు బయటికి వ్యక్తపరుస్తాడు. అదే కొందరికి నచ్చక.. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. కాని నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఖుషీ సక్సెస్‌ని తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటానన్న మాట నిలబెట్టుకున్నాడు విజయ్. నిజంగానే ఫ్యాన్స్‌ని తన ఫ్యామిలీ మెంబర్స్‌లా ఫీల్ అవుతాడు కాబట్టే.. చెప్పినట్టుగానే కోటి రూపాయలను వందమందికి పంచుతానన్న మాట నిజం చేస్తున్నాడు.
ఖుషి హిట్ అయితే, ఆ సక్సెస్‌ని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు వందమందిని సెలక్ట్ చేశాడు విజయ్. ఆ వందమందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పంచనున్నాడు. ఆ లిస్ట్ ఎనౌన్స్ చేశాడు. వాళ్ళకి చెక్స్ రూపంలో ఎమౌంట్‌ని పంపించనున్నాడు. వంద మందికి రూ.లక్ష చొప్పున కోటి పంచుతానన్న విజయ్ మాటని అంతా పబ్లిసిటీ స్టంట్ అన్నారు. ఖుషీ ప్రమోషన్‌లో భాగం అన్నారు. ఐతే ఖుషీ తమిళ్‌లో హిట్టైంది. ఓవర్‌సీస్‌లో రూ.9 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ టాక్ వచ్చింది కాని, ఓవరాల్‌గా పర్లేదంటున్నారు. అయినా రూ.కోటి పంచడంలో మాత్రం విజయ్ వెనకడుగు వేయట్లేదు. అందుకే మాటమీద నిలబడే రౌడీ అనేస్తున్నారు ఫ్యాన్స్.