Vijay Deverakonda: విజయ్ విషయంలో దొరికిపోయిన డిస్ట్రిబ్యూటర్..
వరల్డ్ ఫేమస్ లవర్ వల్ల తను నష్టపోయానని, ఆదుకోవాలంటూ విజయ్ దేవరకొండకి ట్వీట్ చేశాడు అభిషేక్ పిక్ఛర్స్ డిస్ట్రిబ్యూటర్. ఏదో తన ఫ్యాన్స్ కోసం కోటిని పంచాలనుకున్నవిజయ్కి కాల్ చేసి సాయం అడిగితే తప్పులేదు.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అసలే ఖుషీ వసూళ్లు ఇక్కడ బాలేవని బాధపడుతున్నాడు. లక్కీగా యూఎస్‌లో రెండు మిలియన్ల వసూళ్లొచ్చాయి కాబట్టి కొద్దిగా పర్లేదు. ఓపెనింగ్స్ కూడా బాగుండటం, ఇలా రౌడీ క్రేజ్ వల్ల బిలో యావరేజ్ కంటెంట్ ఉన్న ఖుషికి కూడా బానే వసూళ్లొచ్చాయి. అంతా బానే ఉంది. విజయ్ దేవరకొండ మీద యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు, నెగెటివ్ ప్రచారాలు ఎలా ఉన్నా, ఇప్పడు తన ఫెయిల్యూర్ మూవీ డిస్ట్రిబ్యూటర్ కామెంట్లు వివాదంగా మారాయి.
వరల్డ్ ఫేమస్ లవర్ వల్ల తను నష్టపోయానని, ఆదుకోవాలంటూ విజయ్ దేవరకొండకి ట్వీట్ చేశాడు అభిషేక్ పిక్ఛర్స్ డిస్ట్రిబ్యూటర్. ఏదో తన ఫ్యాన్స్ కోసం కోటిని పంచాలనుకున్నవిజయ్కి కాల్ చేసి సాయం అడిగితే తప్పులేదు. కాని, సోషల్ మీడియాలో ఇలా ట్వీట్ చేయటం అంటే సెటైర్ వేయటమే అని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. “నష్టాలొస్తే హీరోని అడుగుతున్నారు.. అదే లాభాలొస్తే ఇస్తారా”.. అంటూ లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకొందరు ఫ్యాన్స్ అయితే “విజయ్ దేవరకిండకి గాడ్ ఫాదర్లు లేరనే కదా ఇలా టార్గెట్ చేశారు. అదే మిగతా పెద్ద హీరోల్లో ఎవరి మూవీ ఫ్లాపైనా ఇలా సోషల్ మీడియాలోకొచ్చి నష్టపరిహారం అడిగే దమ్ముందా” అని ప్రశ్నిస్తున్నారు.
ఐనా నిర్మాతతో తేల్చుకోవాల్సింది హీరోతో ఏంటనే ప్రశ్నించేవాళ్లకి అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా రియాక్ట్ అయ్యాడు. హీరోలని బట్టే బిజినెస్ అని అయినా, తను డబ్బులు కాదు, తనతో సినిమా చేసేందుకు డేట్లే అడిగినట్టు చెప్పడు. దీంతో డేట్లివ్వలేదని గ్రడ్జ్ పెట్టుకుని ఇలా టార్గెట్ చేస్తావా అంటూ కూడా ఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నారు.