Vijay Deverakonda: కల్కిలో విజయ్ దేవరకొండ.. ప్రచారంలో నిజమెంత..?

నిజానికి రౌడీ స్టార్ ఓ యాడ్ కోసం సూపర్ హీరో డ్రెస్‌లో కనిపించాడు. ఆ ఫోటో చూసి కల్కిలో తను గెస్ట్ అంటూ ప్రచారం జరిగిందే తప్ప అది నిజం కాదంటున్నారు. కాని విచిత్రం ఏంటంటే అదే నిజమౌతోంది. దానికి నాగ్ అశ్విన్ సెంటిమెంటో లేదంటే విజయ్‌తో ఉన్న స్నేహమో కారణమౌతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2023 | 05:25 PMLast Updated on: Oct 30, 2023 | 5:25 PM

Vijay Deverakondas Cameo In Kalki 2898 Ad Is It True

Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌గా మారి సంక్రాంతికి రాబోతున్నాడు. మహేశ్ మూవీ గుంటూరు కారంతో పోటీ పడబోతున్నాడు. అంతవరకు ఓకే కాని ఆ సినిమా తర్వాత మే నెలలోనే మళ్లీ తను వెండితెర మీద సూపర్ హీరోగా దర్శనమిచ్చే అవకాశం కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ తీస్తున్న కల్కి 2898 AD మూవీ మే 9కి రాబోతోంది. 85 శాతం షూటింగ్ పూర్తైంది. ఇందులోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ స్పెషల్ రోల్ వేయబోతున్నాడనే మ్యాటర్ హాట్ టాపిక్ అయ్యింది.

నిజానికి రౌడీ స్టార్ ఓ యాడ్ కోసం సూపర్ హీరో డ్రెస్‌లో కనిపించాడు. ఆ ఫోటో చూసి కల్కిలో తను గెస్ట్ అంటూ ప్రచారం జరిగిందే తప్ప అది నిజం కాదంటున్నారు. కాని విచిత్రం ఏంటంటే అదే నిజమౌతోంది. దానికి నాగ్ అశ్విన్ సెంటిమెంటో లేదంటే విజయ్‌తో ఉన్న స్నేహమో కారణమౌతోంది. అసలు విజయ్‌ని సెకండ్ హీరో రూపంలో వెండితెరకు పరిచయం చేసింది నాగ్ అశ్వినే. అంతకుముందు చిన్నా చితకా క్యారెక్టర్స్‌లో కనిపించిన విజయ్.. ఎవడే సుబ్రహ్మణ్యంలో సెకండ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అలా లైమ్ లైట్‌లోకొచ్చాడు. ఆ తర్వాతే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి అంటూ వరుసగా తన ఫేట్ మారింది. అయితే ఇదే నాగ్ అశ్విన్ మేకింగ్‌లో తెరకెక్కిన మహానటిలో కూడా విజయ్ దేవరకొండ స్పెషల్ రోల్ వేశాడు. అది కూడా హిట్టైంది.

అలా ఈ ఇద్దరి మధ్య సెంటిమెంట్ డెవలప్ అయినట్టుంది. అందుకే కల్కిలో రౌడీ స్టార్‌ని సపోర్టింగ్ సూపర్ హీరోగా చూపించబోతున్నాడట నాగ్ అశ్విన్. ఆల్రెడీ ప్రభాస్‌తో దీపికా, అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సీన్‌లోకి విజయ్ వస్తుండటంతో సినీ అభిమానులకు జోష్ పెరుగుతోంది.