Vijay Deverakonda: సినిమా డైలాగ్‌పై ట్రోలింగ్.. ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ..
ప్రభాస్ నుంచి సంపూర్ణేష్ మూవీ వరకు రకరకాల వీడియోలు పెట్టి, వాటికి ఫ్యామిలీ స్టార్ మూవీలోని ఐరనే వంచాలేంటి అనే డైలాగ్ యాడ్ చేస్తున్నారు. అలా ఫ్యామిలీ స్టార్ తాలూకు డైలాగ్ వైరలైంది. విచిత్రం ఏంటంటే గ్లింప్స్ కంటే ఎక్కువగా ఆ పాజిటివ్ ట్రోలింగ్ వీడియోలే వైరలౌతున్నాయి.

Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ మూవీ గ్లింప్స్ మీద సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. కాకపోతే ఈ సారి రౌడీ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ చేయటమే హాట్ టాపిక్ అయ్యింది. అలాగని విజయ్‌కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారా అంటే అదీ లేదు. ప్రభాస్ నుంచి సంపూర్ణేష్ మూవీ వరకు రకరకాల వీడియోలు పెట్టి, వాటికి ఫ్యామిలీ స్టార్ మూవీలోని ఐరనే వంచాలేంటి అనే డైలాగ్ యాడ్ చేస్తున్నారు. అలా ఫ్యామిలీ స్టార్ తాలూకు డైలాగ్ వైరలైంది.
విచిత్రం ఏంటంటే గ్లింప్స్ కంటే ఎక్కువగా ఆ పాజిటివ్ ట్రోలింగ్ వీడియోలే వైరలౌతున్నాయి. విజయ్ కూడా ఈ ట్రోలింగ్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తన డీపీలో తను ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా అదిరిపోయింది. ఇంటర్‌నెట్ ఏమన్నానా అంటూ తను పెట్టిన ఫోటో వైరలైంది. ఇప్పుడే కాదు గీత గోవింతం సినిమా రిలీజ్ టైంలో కూడా తన మీద భారీగా ట్రోలింగ్ జరిగింది. కాకపోతే అప్పుడు బాగా నెగెటివ్‌గా కామెంట్లొచ్చాయి. వాట్ ద లైఫ్ సాంగ్ మీద ఊహించనంత ట్రోలింగ్ వస్తే, ఆ వీడియోలు కూడా షేర్ చేసి వాటిని కూడా ఎంజాయ్ చేశాడు రౌడీ.
అంతేకాదు గీత గోవిందం ఈవెంట్‌లో కూడా ట్రోలింగ్ వీడియోస్‌తో కూడా ప్రమోషన్ పెంచాడు. అలాంటప్పుడు నెగెటివ్ ట్రోలింగ్స్‌నే ఎంజాయ్ చేయగలిగిన విజయ్, పాజిటివ్ ట్రోలింగ్‌ని ప్రమోషన్‌లా ఫీల్ అవటం కామనే. ఏదేమైనా ఫ్యాన్స్ ట్రోలింగ్, దానికి రౌడీ రెస్పాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరలౌతోంది.