Spandana: పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో మరో విషాదం.. ఆ హీరో భార్య ఆకస్మిక మృతి
కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హఠాన్మరణం చెందారు. కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లగా అక్కడ గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు విడిచారు.

Vijay Raghavendra's wife Spandana died of a heart attack during a vacation
కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి.. విజయ్ రాఘవేంద్ర బంధువు. 2021లో పునీత్ గుండెపోటుతో చనిపోగా, ఇప్పుడు వారికి కుటుంబానికి చెందిన స్పందన చనిపోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్పందన డెడ్‌బాడీని మంగళవారం బెంగళూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పందన మృతిపై కన్నడ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్, స్పందన 2007లో లవ్ మ్యారేజీ చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు. పేరు శౌర్య. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు కన్నడ నాట పెద్ద సంఖ్యలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
స్పదంన ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. అంతేకాదు, ఆమె భర్త నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యహరించింది. 2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం అపూర్వలో స్పందన అతిధి పాత్రలో కనిపించింది. స్పందన భర్త విజయ్ కన్నడనాట పాపులర్ హీరోగా కొనసాగుతున్నారు. చిన్నారి ముఠా సినిమాతో జాతీయ అవార్డును అందుకున్నారు. 50 సినిమాలకు పైగా నటించారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. స్పందన తండ్రి బెంగళూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి. ఇదంతా ఎలా ఉన్నా.. మరో 19రోజుల్లో స్పందన, విజయ్‌ల మ్యారేజ్ యానివర్సరీ ఉంది. ఇంతలోనే ఆమె చనిపోవడం.. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.