Vijay Sethupathi: సీఎం బయోపిక్‌లో ప్రముఖ నటుడు
విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్‌తో పేకాడేస్తుంటాడీ వర్సటైల్ హీరో. హీరోగా మాత్రమే కాదు.. విలన్‌గా, గెస్ట్ రోల్, కేరక్టర్ ఆర్టిస్టుగా.. పాత్రలో దమ్ము ఉండాలే కానీ.. తన ఇమేజ్‌ను కూడా పక్కన పెట్టి.. యాక్టింగ్‌కు సై అంటాడు.

Vijay Sethupathi to play the lead role in a biopic based on the life of Karnataka Chief Minister Siddaramaiah
పాన్ ఇండియా లెవల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి నటుడు ఇప్పుడు ఏకంగా సీఎం బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేశాడని టాక్. సీఎం బయోపిక్ అనగానే ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా అనుకుంటున్నారా.. అది కాదు. విజయ్ సేతుపతి చేయబోయేది కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బయోపిక్‌లో అని టాక్. ఓ సామాన్యుడిలా మొదలైన సిద్ధరామయ్య ప్రయాణం.. ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా చేరింది అనేది రెండు భాగాల సినిమాగా తీయనున్నారు.
అయితే హీరోగా దక్షిణాది నటుల్లో చాలామంది పేర్లు వినిపించినా.. ఫైనల్‌గా విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. లాయర్ జీవితంతో పాటు.. పొలిటికల్ లైఫ్‌ను కూడా ఇందులో చూపించబోతున్నారని టాక్. సిద్ధరామయ్య బ్రేకప్ స్టోరీ కూడా ఇందులో చూపించబోతున్నారట. ఈ బయోపిక్‌ని ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే విధంగా తీయబోతున్నారట. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ చిత్రానికి లీడర్ రామయ్య పేరు ఖరారు చేశారు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళంలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.