టాలీవుడ్ హిట్ సినిమాలకు ఇప్పుడు తమిళంలో మంచి డిమాండ్ ఉంది. అక్కడి స్టార్ హీరోలు... ఇక్కడి సినిమాలను గతంలో కూడా రీమేక్ చేసారు. ఇప్పుడు కూడా అలాగే రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ స్టార్, సీనియర్ హీరో విజయ్ ఇప్పుడు తన చివరి సినిమాను ఎలా అయినా హిట్ కొట్టాలని తెలుగు సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. గత రెండు మూడు సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఇప్పుడు తెలుగు సినిమాపైనే డిపెండ్ అయ్యాడు ఈ సీనియర్ హీరో. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసి మీటింగ్ పెట్టాడు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని... అధికారాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. దీనితో అతని చివరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అతని సినిమాగా ‘Thalapathy 69’ని ఇప్పటికే ప్రకటించారు కూడా. ‘తుణివు, వలిమై’ వంటి హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసిన హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ‘బీస్ట్’ సినిమా తర్వాత మరోసారి విజయ్ తో నటిస్తోంది. బాబీ డియోల్ ను కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేసారు. ముందు నుంచి ఈ సినిమా రీమేక్ అనే వార్తలే వచ్చాయి. రిస్క్ చేయకుండా హిట్ సినిమాను రీమేక్ చేయడానికి విజయ్ రెడీ అయ్యాడు. గత ఏడాది అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన... 'భగవంత్ కేసరి' సినిమాను గ్రాండ్ గా రీమేక్ చేయడానికి, తమిళ జనాలకు నచ్చే విధంగా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే హక్కులు కూడా కోనేసారని టాక్. ‘Thalapathy 69’ సినిమాలో ఓ కీ రోల్ కోసం... కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌ని అప్రోచ్ అయ్యారు అని టాక్. తన క్యారెక్టర్ చ్చాలా తక్కువగా ఉందని ఆయన రిజెక్ట్ చేసారు. బాలయ్య స్నేహితుడుగా భగవంత కేసరిలో నటించిన శరత్ కుమార్ రోల్ కు అడిగితే నో చెప్పారట. ఆర్మీ క్యాంప్ లో ఒక షెడ్యూల్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేసారు. శ్రీలీల రోల్ ను ప్రేమలు ఫేమ్ 'మమిత బైజు' చేయనుంది అని టాక్. విలన్ గా అర్జున్ రాంపాల్ ప్లేస్‌లో యానిమల్ తో విలన్ గా ఫేమస్ అయిన... బాబీ డియోల్ నటించనున్నాడని టాక్. కాజల్ ప్లేస్‌లో పూజ హెగ్డే చేస్తుందని అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఈ సినిమా కోసం విజయ్ 275 కోట్లు తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఓవరాల్ గా ఈ సినిమా టార్గెట్ 500 నుంచి 600 కోట్లు అని టాక్.