Vijaya Devarakonda: తప్పుని సరిదిద్దుకునే అవకాశమే లేదా..? హతవిధీ..?

విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ పాన్ ఇండియాని షేక్ చేసే క్రేజ్, ఇమేజ్ ఉన్న స్టార్. కాని తన కెరీర్ లో చేసిన ఒకే ఒక్క తప్పు లైగర్.. ఆ తప్పు వల్లే పాన్ ఇండియా లెవల్లో వందకోట్ల స్టార్ అవ్వాల్సిన తను, సౌత్ కే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. సరే అయ్యిందేదో అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2023 | 04:42 PMLast Updated on: Jun 06, 2023 | 4:42 PM

Vijayadevarakonda Khusi Movie Updates

మళ్లీ విజయ్ దేవరకొండకి తన పాత వైభవం దక్కదా? అలాంటి పరిస్థితులు మళ్లీ రావా..? ఈడౌట్ల తీరాలంటే అర్జుర్ రెడ్డిలాంటి మిరాకిలేదో మళ్లీ జరగాలి.. కాని ఖుషీ ఆ రేంజ్ మూవీకాదు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో విజయ్ దేవరకొండ చేయబోయేది స్పై మూవీ కాబట్టి ఇది కూడా ఏదో మిరాకిల్ చేస్తుందనలేం.

కాని బాలీవుడ్ లో రాజమౌళి లాంటి దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలి తోనే విజయ్ సినిమా సాధ్యమైతే రౌడీ స్టార్ ఫేట్ మారే ఛాన్స్ ఉంది. గతంలో రెండు సార్లు సంజయ్ లీలా భన్సాలిని కలిసిన విజయ్ కి పెద్దగా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. ఐతే సంజయ్ లీలా భన్సాలి మాత్రం రణ్ వీర్ సింగ్ తో ఏదో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నా అని అంటున్నారు. అది ఇద్దరు హీరోల ప్రాజెక్ట్  అయితే మరో హీరోగా విజయ్ ని తీసుకునే అవకాశం మీదే ఊహాగానాలుపెరిగాయి.. సో కనుచూపు మేరలో విజయ్ ఫేట్ మార్చే ఏ ప్రాజెక్ట్ కాని, ఖాలీగా ఉన్న దర్శకుడు కాని కనిపించట్లేదు. కాబట్టి విజయ్ కెరీర్ లో ఏదో మిరాకిల్ జరగాలంటే సంజయ్ లీలా భన్సాలి ప్రాజెక్ట్ తోనే అనంటున్నారు. అనుకుంటున్నారు.