Vijayashanti: మనసు మార్చుకున్న విజయశాంతి.. మళ్లీ నటిస్తోందా..?
సరిలేరు నీకెవ్వరు కథ విన్న తర్వాత నటించనని చెప్పలేకపోయిన లేడీ సూపర్‌స్టార్ 13 ఏళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్‌హిట్‌తో రీ ఎంట్రీ జరిగినా.. ఆఫర్స్ వెల్లువలా వస్తున్నా.. సైన్ చేయలేదు విజయశాంతి.

Vijayashanti: ఆమధ్య ట్విట్టర్‌లో యాక్టింగ్‌కు సెలవంటూ పోస్ట్ పెట్టిన విజయశాంతి మనసు మార్చుకుంది. ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ ఇవ్వడమే కాదు.. ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొంది కూడా. ఇంతకీ లేడీ సూపర్‌స్టార్ ఎవరితో నటిస్తోంది అన్నది ఇప్పుడు చర్చ. సినిమాల్లో నటించాలన్న ఆసక్తి విజయశాంతికి లేకపోయినా.. మూడేళ్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి వెంటపడి మరీ ఆమెను ఒప్పించాడు. సరిలేరు నీకెవ్వరు కథ విన్న తర్వాత నటించనని చెప్పలేకపోయిన లేడీ సూపర్‌స్టార్ 13 ఏళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది.
ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్‌హిట్‌తో రీ ఎంట్రీ జరిగినా.. ఆఫర్స్ వెల్లువలా వస్తున్నా.. సైన్ చేయలేదు విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి నటించే సినిమాపై ఫిలిం వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే వీళ్ల ఆశలపై లేడీ సూపర్‌స్టార్ నీళ్లు చల్లింది. ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ.. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణమని వెల్లడించారు. మళ్లీ సినిమాల్లో నటించే సమయం వస్తుందో, లేదో తెలియదని.. ఇప్పటికి ఇక సెలవని చెప్పేసింది విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు తర్వాత సినిమాలకు సెలవని చెప్పినా.. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చెప్పిన కథకు ఫిదా అయిపోయిన విజయశాంతి.. నందమూరి కల్యాణ్ రామ్ నటించే సినిమాలో కీ రోల్ చేయడానికి ఒప్పుకుంది.
రీసెంట్‌గా జరిగిన సినిమా ఓపెనింగ్‌కు హాజరైంది. స్కందలో రామ్‌తో నటించిన సయీ మంజ్రేకర్ కల్యాణ్ రామ్‌తో జత కడుతోంది. 2019లో దబాంగ్3తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సయీ.. వరుణ్‌తేజ్ ‘గని’తో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మేజర్.. స్కంద.. లేటెస్ట్‌గా కల్యాణ్‌రామ్ మూవీ.. ఇలా వరుసపెట్టి తెలుగు ఆఫర్స్ అందుకుంటోంది.