Vijayendra Prasad: రాజమౌళికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిన తండ్రి విజయేంద్ర ప్రసాద్
తన తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ వల్ల మాత్రం జక్కన్నకి తలనొప్పులు తప్పట్లేదు. రీసెంట్‌గా ఒక ఇంటర్వూలో త్రిబుల్ ఆర్‌లో చరణ్ పాత్రని పొగిడి, తారక్ పాత్రని గెస్ట్ రోల్ వరకే పరిమితమైందనటం, మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు.

Vijayendra Prasad: దర్శక ధీరుడు ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చేస్తాడు. తన సినిమా మొదలైనా, రిలీజ్ అయ్యే వరకు ఏదీ లీక్ కాకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో పని జరుగుతుంది. కానీ, తన తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ వల్ల మాత్రం జక్కన్నకి తలనొప్పులు తప్పట్లేదు.
FIGHTER: గ్రీక్ గాడ్‌ని కాపాడిన బంగారు లేడీ..
రీసెంట్‌గా ఒక ఇంటర్వూలో త్రిబుల్ ఆర్‌లో చరణ్ పాత్రని పొగిడి, తారక్ పాత్రని గెస్ట్ రోల్ వరకే పరిమితమైందనటం, మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో చరణ్, తారక్ ఫ్యాన్స్ మధ్య కామెంట్ల యుద్దం జరుగుతోంది. తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అంటూ విజయేంద్ర ప్రసాద్ మాటలనే కోట్ చేస్తున్నారు. మొన్న కూడా చిరునే ఇండస్ట్రీ పెద్ద అనటంతో నటసింహం టీం హర్ట్ అయ్యిందన్న చర్చ ఫిల్మ్ నగర్‌లో పెరిగింది. మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయే మూవీ ఎలా ఉంటుందో ఊరిస్తూ.. ఒక్కో మాటతో అంచనాలు పెంచేస్తున్న విజయేంద్ర ప్రసాద్, ఇలా ఇంటర్వూల్లో తన మాటలతో వివాదాలకు వెల్ కమ్ చెప్పడం, రాజమౌళికి తలనొప్పిగా మారింది.
అయితే, సీనియర్ రైటర్ ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే రచ్చ జరిగింది. ఇప్పుడు వేరే అంశాలతో ఈ అంశం మరుగునపడినట్లు కనిపిస్తోంది.