Leo Movie: లియో.. తొలిరోజే రికార్డుల మోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్నంటే..!

ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో రూ.17 కోట్ల రేంజ్‌ గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులో రూ.32 కోట్లు, కేరళలో రూ.12.50 కోట్లు, కర్ణాటకలో రూ.14.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 19, 2023 | 07:35 PMLast Updated on: Oct 19, 2023 | 7:35 PM

Vijays Leo Movie To Mint Rs 145 Crore Worldwide

Leo Movie: ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ లియో. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళంతోపాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. మొదటి రోజు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. విడుదలకు ముందే సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా విదేశాల్లో ఈ సినిమా మొదటి రోజు పాత ఇండియన్ సినిమా రికార్డుల్ని చెరిపేసింది.

తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో రూ.17 కోట్ల రేంజ్‌ గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులో రూ.32 కోట్లు, కేరళలో రూ.12.50 కోట్లు, కర్ణాటకలో రూ.14.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇండియాలో రూ.80 కోట్ల గ్రాస్ రావొచ్చు. ఇక ఓవర్సీస్‌లో రూ.65 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ.145 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. ఇది విజయ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్. కోలీవుడ్ నుంచి తొలి రోజు వంద కోట్లకుపైగా గ్రాస్ అందుకున్న చిత్రంగా కూడా నిలుస్తుంది.

అంతకుముందు తెలుగు నుంచి బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు ఇలా తొలి రోజు రూ.100 కోట్లకుపైగా గ్రాస్ అందుకున్నాయి. లోకేష్, విజయ్ కాంబో.. ఈ కలెక్షన్లకు కారణం. ఈ మూవీ కలెక్షన్లపై పూర్తిస్థాయి ప్రకటన శుక్రవారం వెలువడుతుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.