Taraka Ratna: విజయసాయిని హత్తుకున్న తారకరత్న పిల్లలు.. కన్నీళ్లు పెట్టించే దృశ్యం..
తారకరత్నతో తన మధుర జ్ఞాపకాలను సోషల్‌మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది. ఇప్పుడు అలేఖ్య షేర్ చేసిన ఓ వీడియో.. వైరల్ అవుతోంది.

Taraka Ratna: నందమూరి తారకరత్న చనిపోయి.. దాదాపుగా ఏడాది కావొస్తోంది. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమై.. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్న.. హార్ట్‌ఎటాక్‌తో ఆసుపత్రి పాలయ్యారు. చాలారోజుల చికిత్స తర్వాత ప్రాణాలు విడిచారు. ఐతే ఆయన జ్ఞాపకాలు.. ఇప్పటికీ నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలను వెంటాడుతూనే ఉన్నాయ్.
Vijaysai Reddy: సంచలనం.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలబోతుందా ?
తారకరత్నను పిల్లల్లో చూసుకంటూ.. ఆయన లేరు అన్న మాటకు నెమ్మదిగా అలవాటు కావడం మొదలుపెట్టారు. తారకరత్న చనిపోయి ఏడాది కావొస్తున్నా.. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆయన జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య నిత్యం తారకరత్న జ్ఞాపకాలతోనే జీవితం గడిపేస్తోంది. తారకరత్నతో తన మధుర జ్ఞాపకాలను సోషల్‌మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది. ఇప్పుడు అలేఖ్య షేర్ చేసిన ఓ వీడియో.. వైరల్ అవుతోంది. ఇందులో పెద్దకూతురు తారకరత్న ఫొటో దగ్గర ఏదో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత డ్యాన్స్ కూడా చేస్తుంది.
మిగతా ఇద్దరూ పిల్లలు కూడా ఎంతో జాలీగా కనిపించారు. తల్లితో కలిసి అందరూ సరదాగా గడిపారు. సైక్లింగ్ కూడా చేశారు. ఇంతలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కావడం.. ఆయనను చూసిన తారకరత్న పిల్లలు తాతాయ్యా అంటూ హగ్ చేసుకునే దృశ్యాలకు సంబంధించిన వీడియోలఉ వైరల్ అవుతున్నాయ్. విజయసాయి కూడా అంతే ప్రేమగా.. పిల్లలను హగ్ చేసుకోవడం.. కళ్లలో తెలియకుండానే నీళ్లు తిరిగేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా.. బాగా ఎమోషనల్‌గా, గుండె బరువెక్కించేలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి… విజయసాయిరెడ్డికి బంధుత్వం ఉంది. విజయసాయిరెడ్డి భార్య సోదరి కుమార్తెనే అలేఖ్యారెడ్డి. వరుసకు అలేఖ్యారెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న అవుతారు.