Vikram Kumar: కంటెంట్ కత్తిలా ఉన్నా ఆయన సినిమాలకు వసూళ్లు రావా..?
మనం మూవీ హిట్టే. కాని ప్రాఫిట్లు వచ్చేంతగా వసూళ్ల వర్షం రాలేదు. సూర్యతో 24 మూవీ తీస్తే రూ.100 కోట్ల పెట్టుబడి రూ.95 కోట్ల రాబడిగా మారింది. ఇక్కడా లాభాల్లేవు. ఇష్క్ ఒక్కటే హిట్‌తో పాటు లాభాలు తెచ్చిన సినిమా. అందుకే ఈ దర్శకుడి మూవీలు బాగుంటాయి కాని డబ్బులు రావనే స్టాంప్ పడింది.
Vikram Kumar: విక్రమ్ కే కుమార్ ఓ విచిత్రమైన దర్శకుడు. తన సినిమాలు, కథలు కూడా విచిత్రంగానే ఉంటాయి. హిట్ అవటమే కాదు, రివ్యూల నుంచి పబ్లిక్ టాక్ వరకు అంతటా తన సినిమాలకు మంచిపేరే వస్తుంది. సూర్యతో 24, అక్కినేని ఫ్యామిలీతో మనం, మాధవన్‌తో 13 బి, నితిన్‌తో ఇష్క్.. ఇలా మంచి మంచి హిట్లున్నాయి. వెరైటీ కథలు రాస్తాడు, తీస్తాడనే పేరుంది. కాని ఇటీవలి తన సినిమాల్లో ఎక్కువ శాతం సరైన కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. మనం మూవీ హిట్టే. కాని ప్రాఫిట్లు వచ్చేంతగా వసూళ్ల వర్షం రాలేదు.
SS RAJAMOULI: జక్కన్న రూట్లోనే వెళుతున్న పాన్ ఇండియా డైరెక్టర్లు..
సూర్యతో 24 మూవీ తీస్తే రూ.100 కోట్ల పెట్టుబడి రూ.95 కోట్ల రాబడిగా మారింది. ఇక్కడా లాభాల్లేవు. ఇష్క్ ఒక్కటే హిట్‌తో పాటు లాభాలు తెచ్చిన సినిమా. అందుకే ఈ దర్శకుడి మూవీలు బాగుంటాయి కాని డబ్బులు రావనే స్టాంప్ పడింది. అచ్చంగా ఇలాంటి రిమార్కే చంద్రశేఖర్ ఏలేటి మీద కూడా ఉంది. ఐతే నుంచి చెక్ వరకు, సాహసం నుంచి మనమంతా వరకు ఎన్నో ప్రయోగాల చేశాడు. ఏం తీశాడురా అనేలా కథలు, కథనం ఉంటాయి. అదేంటో ఏవీ కమర్శియల్‌గా వర్కవుట్ కావు. అందుకే నిర్మాతలు తన మూవీ అంటే కథ ఎంతబాగున్నా తనతో తీయటానికి భయపడతారు. ఇదే విక్రమ్ కుమార్‌కి వర్తిస్తోంది. చైతన్యతో థ్యాంక్యూ తీశాడు. ఆ సినిమా పోయింది. నానితో గ్యాంగ్ లీడర్ తీశాడు. టాక్ కిక్ ఇచ్చినా వసూళ్లు రాలేదు.
ఇప్పుడు వెబ్ సీరీస్ దూత తీశాడు. ట్రైలర్ తుస్సుమంది. ఓటీటీలో ఆడటం కూడా కష్టమే అంటున్నారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. మరి ఈ సినిమా అయినా విక్రమ్ కుమార్‌కు కావాల్సిన సక్సెస్ ఇస్తుందా.. లేదా.. చూడాలి.