Vikramarkudu-2: త్వరలో విక్రమార్కుడు 2.. హీరోగా రవితేజ..?

మాస్ మహారాజా రవితేజ, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో విక్రమార్కుడు వచ్చింది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. పైగా ఇంకో విషయం ఏంటంటే జక్కన్న, రవితేజల సినీ కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లిపోయేలా చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2024 | 06:33 PMLast Updated on: Apr 20, 2024 | 6:34 PM

Vikramarkudu Seuel Story Is Ready Says Story Writer V Vijayendra Prasad

Vikramarkudu-2: సినిమాకి ప్రత్యేకంగా దేవుడు లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే సినీ ప్రేమికులు ఇప్పుడు సినీ మార్కెట్‌లో వస్తున్న ఒక న్యూస్ చూసి ఆ సినిమా త్వరగా రావాలని మొక్కుకునే వాళ్ళు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆనందంతో పులకరించి పోతున్నారు. ఆ న్యూస్ వింటే మీరు కూడా ఆనందపడతారు. 2006లో మాస్ మహారాజా రవితేజ, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో విక్రమార్కుడు వచ్చింది.

Ilaiyaraaja: గొప్ప కాదా.. ఇళయారాజా అయితే ఏంటి గొప్ప..?

ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది. పైగా ఇంకో విషయం ఏంటంటే జక్కన్న, రవితేజల సినీ కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్లిపోయేలా చేసింది. మరి ఇలాంటి ట్రెండ్ సెట్ మూవీకి సీక్వెల్ ఉంటుందనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. తాజాగా ఆ విషయంపై ఒక ప్రొడ్యూసర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. విక్రమార్కుడు 2 స్క్రిప్ట్‌ని రైటర్ విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. సరైన కాస్టింగ్ దొరికితే షూట్‌కి వెళ్తామని చెప్పాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సీక్వెల్‌‌లో రవితేజ ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. డైరెక్షన్ కూడా జక్కన్న చేస్తాడా లేక వేరే వాళ్ళు చేస్తారా అనేది తెలియాలి.

విక్రమార్కుడులో దొంగగా, పోలీసుగా రవితేజ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మూవీలోని ఆయన ఊతపదం జింతాక్ జింతాక్ నేటికీ కుర్ర కారు నోటి వెంట వినపడుతూనే ఉంది. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా చెయ్యగా బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజయ్ విలన్‌గా చేసాడు. కీరవాణి సంగీతాన్ని అందించాడు.