బాక్సాఫీస్ కు వర్మ నిప్పు, వింటేజ్ వర్మ ఈజ్ బ్యాక్

ఒకప్పటి రాంగోపాల్ వర్మ సినిమాలు చూస్తే అసలు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నది ఆ వర్మనేనా...? అని చాలామంది షాక్ అవుతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2025 | 01:35 PMLast Updated on: Jan 24, 2025 | 1:35 PM

Vintage Varma Is Back

ఒకప్పటి రాంగోపాల్ వర్మ సినిమాలు చూస్తే అసలు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నది ఆ వర్మనేనా…? అని చాలామంది షాక్ అవుతారు. సత్య, సర్కార్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన వర్మ ఆ తర్వాత చెత్త సినిమాలు చేస్తూ అనవసరమైన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ తన టాలెంట్ మొత్తం వేస్ట్ చేస్తున్నారని అభిమానులు ఎంతగానో ఫీలయ్యారు. ఇప్పటికీ చాలామంది దర్శకులకు రాంగోపాల్ వర్మ ఒక రోల్ మోడల్. ఆయన శిష్యులందరూ మంచి సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టి స్టార్ డైరెక్టర్లు అయితే ఆయన మాత్రం ఇంకా కాంట్రవర్సీలు తోనే తిరుగుతున్నారు.

ఇక ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న వాళ్లు కూడా స్టార్ డైరెక్టర్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఈ టైంలో వర్మ మంచి సినిమా చేసి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయన తర్వాత వచ్చిన డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా అని హడావిడి చేస్తుంటే వర్మ మాత్రం వెబ్ సీరిస్ లు, సోషల్ మీడియాలో పోస్ట్లతో టైం వేస్ట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా తన సత్య సినిమా చూసి కాస్త ఎమోషనల్ అయినా రాంగోపాల్ వర్మ తనకి జ్ఞానోదయం అయినట్లుగా చెప్పారు. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తానని అనౌన్స్ చేశారు.

ఆ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన రెండు రోజుల్లోనే సిండికేట్ అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని తాను అనౌన్స్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ. 1970 ల నేపధ్యంలో జరిగే కథగా, ఒక గ్యాంగస్టర్ డ్రామా అన్నట్లుగా దీనిని వర్మ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం చాలా భయానకంగా ఉంటుందని ఎలాంటి అతీత శక్తుల ఎలిమెంట్స్ లేకుండా కేవలం మనిషి ఎంత భయంకరంగా భయపెట్టగలడు… అనే కోణాన్ని తాను చూపించబోతున్నానని వర్మ అనౌన్స్ చేశారు. 1970లో రాజకీయాలను మించిన స్ట్రీట్ గ్యాంగ్లు కరుడుగట్టిన రాజకీయ పార్టీల్లోకి ప్రవేశించి తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైన వాటికి విపరీతమైన డిమాండ్ కారణంగా స్మగ్లింగ్ చేశాయని ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్ రాసారు.

వాటిని కూడా ఆర్థిక సంస్కరణలు నాశనం చేశాయని వర్మ పోస్ట్ చేశారు. ఆపై ఘోరమైన కార్పొరేట్ ముఠాలు, దావూద్ గ్యాంగులు వచ్చాయని అదేవిధంగా భయంకరమైన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దెబ్బకు ఆల్కైదా కూడా సైలెంట్ అయిపోయిందని.. పోస్ట్ చేసిన వర్మ భారతదేశంలో గత 10 15 ఏళ్ల నుంచి చెప్పుకోదగ్గ నేరసంస్థ ఏది లేదని… కానీ ప్రస్తుతం భారతదేశంలో వివిధ దేశాల మధ్య పురుడు పోసుకున్న ఒక నేర సంస్థ యొక్క పురోగమనడానికి సమయం ఆసన్నమైంది అంటూ వర్మ పోస్టు పెట్టారు. గతంలోని సంస్థలకు భిన్నంగా ఈ కొత్త సంస్థ పోలీసింగ్ ఏజెన్సీలు, రాజకీయాలు, ఆల్ట్రా రిచ్ బిజినెస్మెన్, అలాగే మిలిటరీ సహా వివిధ సమూహాల నుండి లింక్ చేసుకొని ఉంటుందని తద్వారా ఇది సిండికేట్ గా మారిందని వర్మ సెన్సేషనల్ పోస్ట్ చేశారు. సిండికేట్ అత్యంత భయంకరమైన సినిమా అని దీని లక్ష్యం ప్రస్తుత భారతదేశాన్ని సరికొత్త భారతదేశంతో భర్తీ చేయడమే అంటూ తన సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చారు.