VIRAT KOHLI: బయోపిక్స్ ట్రెండ్.. విరాట్ కోహ్లీ బయోపిక్‍..! హీరో ఎవరంటే.

క్రికెటర్ల జీవితకథలతో సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దర్శక, నిర్మాతలు. బాగ్ మిల్కా బాగ్, పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ వరుసలో తర్వాత చాలా స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 17, 2023 | 01:55 PMLast Updated on: Nov 17, 2023 | 1:55 PM

Virat Kohli Biopic On Cards Who Will Be Playing Lead Role

VIRAT KOHLI: సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్‌కి మంచి గిరాకీ ఉండటంతో టాలీవుడ్ టు బాలీవుడ్ మేకర్స్ కన్ను వాటిపైనే పడింది. ఇప్పటికే చాలా మంది ప్లేయర్స్ లైఫ్ స్టోరీలు కాసులు కురిపించగా.. తాజా మరో క్రికెటర్‌ జీవితకథ వెండితెరపైకి రాబోతోంది. ఇందులో నటించడానికి ముగ్గురు స్టార్స్ పోటీపడుతుండటం సెన్సేషన్‌గా మారింది. సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా క్రికెటర్ల జీవితకథలతో సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దర్శక, నిర్మాతలు.

Bigg Boss 7 : చరిత్ర సృష్టించిన యావర్.. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ కంటెస్టెంట్‌గా రికార్డు..

బాగ్ మిల్కా బాగ్, పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ వరుసలో తర్వాత చాలా స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి. ఇప్పటికే ధోని, అజార్, సచిన్, ఇటీవల కపిల్ దేవ్ జీవితకథతో ’83’ సినిమా కూడా వచ్చింది. వరల్డ్ కప్ వేళ తాజాగా మరో క్రేజీ క్రికెటర్ కోహ్లీ జీవిత కథతో సినిమా తీయబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టులో నటించేందుకు ముగ్గురు స్టార్ హీరోలు పోటీపడుతుండటం విశేషంగా మారింది. కోహ్లీ జీవిత చరిత్రలో నటించేందుకు బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం వద్దంటున్నారు. గతంలో క్రికెటర్స్ బయోపిక్ తీస్తే, ధోని మినహా ఎవరివి అంత ప్రభావం చూపలేదు.

కారణం ధోని ప్లేయర్‌గా ఫామ్‌లో ఉండగానే సినిమా వచ్చింది. పైగా ధోని జీవితంలో సినిమాకు సరిపోయెంత లవ్ స్టోరీ, విషాదం, కష్టం, అవమానాలు, స్పూర్తి ఉన్నాయి. కానీ సచిన్, అజార్, కపిల్ దేవ్‌‌పై తీసిన సినిమాలలో వాటి స్థాయి తక్కువ ఉండటంతో పెద్దగా క్రేజ్ కనిపించలేదు. పైగా అప్పటికే వీరందరు రిటైర్ అయిపొయి ఉన్నారు. ఇక ఇప్పుడు కోహ్లీ బయోపిక్ తీయాలనుకుంటున్నారు. కానీ ఆయన జీవితంలో కష్టాలు తక్కువే‌‌. దీంతో కోహ్లీ కథతో సినిమా చేస్తే అంతగా ఆడదేమో అన్న మాటలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.