Virat Kohli : ఎన్టీఆర్ పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

విరాట్ కోహ్లి, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు రెండు వేరు వేరు రంగాల్లో సూపర్ స్టారు. ఒకరు క్రీడా రంగంలో అయితే మరోకరు సినీ రంగంలో స్టార్లుగా కొనసాగుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2024 | 07:00 PMLast Updated on: May 27, 2024 | 7:00 PM

Virat Kohlis Sensational Comments On Ntr

విరాట్ కోహ్లి, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు రెండు వేరు వేరు రంగాల్లో సూపర్ స్టారు. ఒకరు క్రీడా రంగంలో అయితే మరోకరు సినీ రంగంలో స్టార్లుగా కొనసాగుతున్నారు. ఇక వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి వారిద్దరు కూడా చాలా క్లోజ్ ప్రెండ్స్ అంట. విన్నాడానికి ఆశ్చర్యమైన.. ఆ విషయాన్ని విరాటే స్వయంగా చెప్పాడు. జూనియర్ ఎన్టీర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో తారక్ తనకు మంచి స్నేహితుడంటూ కోహ్లి వ్యాఖ్యలు చేశాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఇద్దరు కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా అయినట్లు విరాట్ కోహ్లీ చెప్పారు. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు అని చెప్పారు. నాటు నాటు పాటకు ఆయన చేసిన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని తనకు ఆ పాట అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇక ఆ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కి స్టెప్పులేస్తూ తాను, అనుష్క రీల్స్ కూడా చేశామని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆ పాటకు ఆస్కార్ వచ్చిందనే సంతోషంతో నాటు నాటు పాటకు గ్రౌండ్‌లో డ్యాన్స్ చేశా అని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం కోహ్లీ వరల్డ్ లోనే టాప్ క్రికెటర్ గా వెలుగొందుతున్నాడు. అలాంటి టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ.. స్వయంగా ఎన్టీఆర్ తనకు స్నేహితుడని అని, అతని యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ గురించి విరాట్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి