Virupaksha Movie Review: బొమ్మ బంభాట్.. తేజ్ హిట్ కొట్టేశాడు!
సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తరవాత మళ్లీ హిట్టు కొట్టేశాడు. ముఖ్యంగా మూవీ ఫస్టాఫ్ చాలా బాగుంది. రెండేళ్ల బ్రేక్ తర్వాత ఒక సాలిడ్ బొమ్మతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుప్రీం హీరో. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులు ఎవరూ ఈ మధ్య కాలంలో నిరాశపరచలేదు.
Virupaksha Movie Review: సాయిధరమ్ తేజ్ విరూపాక్ష’ సినిమా హిట్ బొమ్మగా నిలిచింది . సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తరవాత మళ్లీ హిట్టు కొట్టేశాడు. ముఖ్యంగా మూవీ ఫస్టాఫ్ చాలా బాగుంది. రెండేళ్ల బ్రేక్ తర్వాత ఒక సాలిడ్ బొమ్మతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుప్రీం హీరో. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులు ఎవరూ ఈ మధ్య కాలంలో నిరాశపరచలేదు.
ఉప్పెనతో బుచ్చిబాబు సెన్సేషనల్ హిట్ నమోదు చేస్తే.. దసరాతో శ్రీకాంత్ ఓదెల మతిపోగొట్టాడు. ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు కార్తీక్ దండు కూడా మంచి హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురైన తరవాత నటించిన సినిమా కావడంతో విరూపాక్షపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రిపబ్లిక్ లాంటి సోషల్, పొలిటికల్ డ్రామా తరవాత సాయితేజ్ చేసిన థ్రిల్లర్ మూవీ ఇది. సుమారు రెండేళ్ల విరామం తరవాత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో కనిపించింది. అయితే అంచనాలను అందుకోవడంలో మూవీ సక్సెస్ అయింది. సాయితేజ్‌కి హిట్ పడింది. ముఖ్యంగా విరూపాక్ష ఫస్టాఫ్ అదిరిపోయింది. సాయిధరమ్ తేజ్ లుక్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి.
డైరెక్టర్ కార్తీక్ సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. దర్శకుడు కథను నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. సుకుమార్ రాసిన స్క్రీన్‌ప్లే అయితే ప్రేక్షకుడిని సీటులో నుంచి కదలనివ్వలేదు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో పెద్ద బలం. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కాలంపాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎలాంటి అనవసర సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఫస్టాఫ్‌లో స్ట్రయిట్‌గా పాయింట్‌కు వెళ్లిపోయాడు. అయితే, ఫస్టాఫ్ ఉన్నంత ఎంగేజింగ్‌గా సెకండాఫ్ లేదు. ముఖ్యంగా లవ్ ట్రాక్ కాస్త బోరింగ్‌గా ఉంది.
ఇలాంటి సన్నివేశాలు ప్రధాన కథను దారి మళ్లించినట్లు అనిపిస్తాయి. లవ్ స్టోరీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా అదే ప్లాట్‌లో కథను తీసుకెళ్లుంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. చిన్న చిన్న మైనస్‌లు వదిలేస్తే.. బొమ్మ అదిరిపోయింది. మొత్తానికి సుప్రీం హీరో తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే.