Vishal: తమిళ నటితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన విశాల్..
ప్రస్తుతం విశాల్ సింగిల్‌గానే ఉంటున్నాడు. సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ పెళ్లి గురించి ఇప్పుడో న్యూస్ వైరల్ అవుతోంది. తమిళ్ యాంగ్ బ్యూటీతో విశాల్ ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Vishal: కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విశాల్ కూడా తగ్గేదే లే అన్నట్లుగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్‌లు అసలు పట్టించుకోడు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ విశాల్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంటాయి.
సినిమాతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ విశాల్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. విశాల్ పెళ్లి గురించి ఇప్పటికే రకరకాల రూమర్స్ వచ్చాయి. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. ఐతే అది జరగలేదు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ అనిషా రెడ్డితో విశాల్ వివాహం కావాల్సి ఉంది. ఈ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతారు అనుకునే సమయంలో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం విశాల్ సింగిల్‌గానే ఉంటున్నాడు. సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ పెళ్లి గురించి ఇప్పుడో న్యూస్ వైరల్ అవుతోంది. తమిళ్ యాంగ్ బ్యూటీతో విశాల్ ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే ఈ ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై రియాక్ట్ అయ్యాడు హీరో విశాల్. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు. ఆమె ఓ నటి కంటే ముందు అమ్మాయి అని, ఆమె వ్యక్తిగత జీవితం పై ఈ వార్తలు ప్రభావం చూపకూడదనే స్పందిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో రూమర్లకు చెక్ పడినట్లు అయింది.