VISHAL: ఇప్పట్లో లేనట్లేనా.. విశాల్ రాజకీయాల్లోకి రావడం లేదా..?

త్వర‌లోనే విశాల్ రాజ‌కీయ పార్టీ పెడ‌తారంటూ వార్త‌లు వినిపించాయి. దీంతో.. విశాల్ స్వ‌యంగా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి విశాల్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 06:10 PMLast Updated on: Feb 07, 2024 | 6:10 PM

Vishal Denies Venturing Into Politics Releases A Statement About His Future In Public Service

VISHAL: సినీ న‌టులు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం కొత్తేమీ కాదు. ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు గ్లామ‌ర్ ఫీల్డ్ నుంచి వ‌చ్చి పొలిటిక‌ల్ ఫీల్డ్‌ని ఏలారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. జ‌న‌సేనానిగా ఏపీ పాలిటిక్స్‌లో త‌నదైన ముద్ర వేస్తున్నారు. అటుపై త‌మిళ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా సినిమాల‌కు రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. తాత‌య్య క‌రుణానిధి, తండ్రి ఎం.కె స్టాలిన్ వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డానికి ఉద‌య్ సీన్‌లోకి వ‌చ్చాడు. అయితే.. ఈ లిస్ట్‌లోకి రీసెంట్‌గా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కూడా చేరిపోయాడు. తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించిన విజ‌య్.. 2026 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున‌్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు.

KUMARI AUNTY: అమ్మో.. ఇదేం క్రేజ్‌.. కుమారి ఆంటీపై నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌

దీంతో.. ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌రో స్టార్ హీరో అయిన విశాల్ మీద ప‌డింది. విజ‌య్ రాజ‌కీయ పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే మ‌రో హీరో విశాల్ రాజ‌కీయ ప్ర‌వేశం గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. త్వర‌లోనే విశాల్ రాజ‌కీయ పార్టీ పెడ‌తారంటూ వార్త‌లు వినిపించాయి. దీంతో.. విశాల్ స్వ‌యంగా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి విశాల్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ‌త ఐదేళ్లుగా త‌మిళ‌నాట ఏదో ఒక‌ సంద‌ర్భంలో విశాల్ పొలిటిక‌ల్ ఎంట్రీపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణ భార‌త న‌టీన‌టుల‌ న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో నిల‌బ‌డిన విశాల్.. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌తో వాగ్వాదంతో ఫేమ‌స్ అయిపోయాడు. ఆ త‌ర్వాత జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా బాధ్య‌తలు చేప‌ట్టిన విశాల్.. ఇక అప్ప‌టినుంచి ప‌లు సంద‌ర్భాల‌లో త‌న‌ వ్యాఖ్య‌లతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. దీంతో.. విశాల్ పొలిటిక‌ల్ ఎంట్రీ ప‌క్కా అంటూ ఎప్ప‌టి నుంచో విశాల్ ఫ్యాన్స్‌తో పాటు త‌మిళ ప్ర‌జ‌లు కూడా గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో విజ‌య్ పార్టీ ఎనౌన్స్‌మెంట్‌తో తమిళ రాజకీయాలు ఒక్క‌సారిగా హీటెక్క‌డంతో పాటు మ‌రోసారి విశాల్ పొలిటిక‌ల్ ఎంట్రీపై హాట్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

ఇలా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై రేగుతున్న దుమారంపై విశాల్ స్పందించాడు. రాజ‌కీయ పార్టీ పెడ‌తానంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘నాకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజ‌ల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. నాకు చేత‌నైన సాయం చేయాల‌నే ఉద్దేశంతోనే దేవి పౌండేష‌న్ ద్వారా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశాను. లాభాలు ఆశించి ఏ ప‌నీ చేయ‌లేదు. ఇప్పుడైతే రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. కాలం నిర్ణ‌యిస్తే ప్ర‌జ‌ల కోసం పోరాడుతా’ అని తెలిపాడు. కాగా, 2017లో రాజ‌కీయాల్లో త‌న అదృష్టం ప‌రీక్షించుకునేందుకు విశాల్ చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో జ‌రిగిన ఆర్‌కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు విశాల్ ప్రయ‌త్నించ‌గా ప్రిసైడింగ్ అధికారి ఆయ‌న నామినేష‌న్‌ను తిర‌స్కరించారు. మొత్తానికి ఏది ఏమైనా.. ఇప్పట్లో త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ లేద‌ని విశాల్ చెప్పేసిన‌ట్లే మ‌రి.