Mark Antony: వంద కోట్ల సినిమా.. అప్పుడే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!
సెప్టెంబర్ 15న తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే, తమిళంలో మాత్రం విశాల్ కెరీర్లోనే పెద్ద విజయం అందుకుంది. తెలుగు, తమిళం కలిపి దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.
Mark Antony: తమిళ యాక్షన్ హీరో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోని. సెప్టెంబర్ 15న తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే, తమిళంలో మాత్రం విశాల్ కెరీర్లోనే పెద్ద విజయం అందుకుంది. తెలుగు, తమిళం కలిపి దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో తమిళ వాటానే ఎక్కువ. ఇప్పటికీ తమిళంలో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇంత సక్సెస్ సాధించి, విశాల్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. అంటే చిత్రం విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు వస్తుండటం విశేషం. హీరోగా విశాల్, విలన్‌గా ఎస్‌జె సూర్య.. ఇద్దరూ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఈ చిత్రంలో తమిళ వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించారు. రీతూవర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. తెలుగు నటుడు సునీల్ మరో కీలక పాత్రలో కనిపించాడు.
టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో, కామెడీ, థ్రిల్ అంశాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో, 1975- 95 మధ్యలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఆ కాలం నాటి వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం ఆరున్నర లక్షలు లంచం ఇవ్వాల్సివచ్చిందని ఇటీవల విశాల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ అంశంపై నేరుగా కేంద్రమే స్పందించి, దర్యాప్తునకు ఆదేశించింది.