Vishwak Sen: ఫ్లీజ్ సపోర్ట్ కావాలి.. గామి మూవీకి కూడా సపోర్ట్ చెయ్యండి..

విశ్వక్ సేన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా నిలిచాయి. ఇండస్ట్రీ పెద్దలు గామిని చూసి సపోర్ట్ చేయాలని.. అదే టైంలో నాలుగు మంచి మాటలు కూడా చెప్పాలని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అలా సపోర్ట్ చెయ్యటం వల్ల గామికి ఎంతో ఉపయోగం కలుగుతుందని.. పైగా ఇది మన తెలుగు సినిమా అన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2024 | 01:38 PMLast Updated on: Mar 14, 2024 | 1:38 PM

Vishwak Sen Comments About Film Industry On Gaami Movie

Vishwak Sen: విభిన్న కధాంశంతో కూడిన చిత్రాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. మొన్న శివరాత్రికి గామి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఇంతవరకు రానటువంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఆ మూవీ తెరకెక్కింది. అలాగే మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా గామి వండర్‌కి ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా నిలిచాయి.

BJP Add Campaign: యాడ్స్ కోసం బీజేపీ రూ.30 కోట్లు ఖర్చు ! రూపాయి ఖర్చుపెట్టని బీఆర్ఎస్, కాంగ్రెస్ !

ఇండస్ట్రీ పెద్దలు గామిని చూసి సపోర్ట్ చేయాలని.. అదే టైంలో నాలుగు మంచి మాటలు కూడా చెప్పాలని చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అలా సపోర్ట్ చెయ్యటం వల్ల గామికి ఎంతో ఉపయోగం కలుగుతుందని.. పైగా ఇది మన తెలుగు సినిమా అన్నాడు. ఇంతవరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని చెప్పుకొస్తున్నాడు. అలాగే ఎవరు ఎన్ని అనుకున్నా ప్రేక్షకులు కొన్ని దశాబ్దాలు తర్వాత కూడా గామి గురించి మాట్లాడుకుంటారని కూడా అంటున్నాడు. రీసెంట్‌గా రాజమౌళి ప్రేమలు సినిమాకు సపోర్ట్‌గా నిలిచిన తరుణంలో విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. హిమాలయాల్లో ఎక్కువ భాగం షూటింగ్‌ని జరుపుకున్న గామి కోసం విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు.

తినడానికి తిండి తాగడానికి మంచి నీళ్లు కూడా లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. చాందిని చౌదరి కూడా విశ్వక్ సేన్‌లాగా చాలా కష్టాలు పడింది. ఇప్పుడు ఆ ఇద్దరి నటనకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. క్లౌన్ పిక్చర్స్, కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ నిర్మించగా విద్యాధర్ కాగిత దర్శకుడుగా వ్యవహరించాడు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ రిలీజ్ చేసింది. అలాంటి సినిమాకు పెద్దలు సపోర్ట్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరి విశ్వక్ సేన్ మాటలు విన్న సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.