మెగా నందమూరి రెబల్ హీరో… గెలికితే గొడవే…
టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కామన్. నందమూరి హీరోల బాక్సాఫీస్ ని మోసేందుకు సెపరేట్ గా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలా చూస్తే అల్లు అర్జున్ కి అల్లు ఆర్మీ, ప్రభాస్ కి పాన్ ఇండియా రెబల్ ఫ్యాన్స్, మహేశ్ బాబుకి సూపర్ ఫ్యాన్స్ ఇలా ఎవరి టీం వాళ్లకి ఉంది..

టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కామన్. నందమూరి హీరోల బాక్సాఫీస్ ని మోసేందుకు సెపరేట్ గా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలా చూస్తే అల్లు అర్జున్ కి అల్లు ఆర్మీ, ప్రభాస్ కి పాన్ ఇండియా రెబల్ ఫ్యాన్స్, మహేశ్ బాబుకి సూపర్ ఫ్యాన్స్ ఇలా ఎవరి టీం వాళ్లకి ఉంది.. కాని విశ్వక్ సేన్ లాంటి హీరోల పరిస్థితేంటి..? విజయ్ దేవరకొండ, సిద్దూ జొన్నలగడ్డ అండ్ కో పరిస్థితేంటి..? వాళ్లకి హిట్లొస్తే వాళ్లకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ క్రియేట్ అయ్యింది … కాకపోతే మెగా, పవర్ ఫ్యాన్స్ … రెబల్, సూపర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అంత రేంజ్ లేదు… అందుకే విశ్వకే సేన్, తన ఫ్యాన్స్ తో పాటు మెగా నందమూరి రెబల్ ఫ్యాన్స్ ని వాడేస్తున్నాడు.మొన్నటి వరకు వివాదాలతో తన సినిమాను దూసుకెళ్లేలా చేశాడు.. ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు… ఇక ముందేం చేస్తాడో కాని… వివాదాలు లేకుండా విశ్వక్ సేన్ సినిమాలు లేవు… రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉన్నా, తన సినిమా వస్తోందంటే వివాదానికి వెల్ కమ్ చెప్పాల్సిందే.. ఇంత కష్టపడ్డా తనకి పాన్ ఇండియా లెవల్లో లక్ లేదు… కనీసం పక్క మార్కెట్ లో కూడా సీన్ లేదు. లోకల్ గా కాంట్రవర్సిస్ తో గుర్తింపు తప్ప సక్సెస్ మాత్రం మిస్ అవుతూనే ఉంది.
విశ్వక్ సేన్ అంటేనే వివాదాల హీరో. తన మూవీ హిట్ అవుతుందో లేదో కాని, తన సినిమా వస్తోందంటే వివాదం మాత్రం మొదలౌతుంది. ఇప్పుడు తన కొత్త మూవీ లైలా సినిమా పరంగా వివాదం కాలేదు కాని, దాని ప్రమోషన్ పరంగా ఊహించని రేంజ్ లో సెన్సేషన్ అవుతూనే వివాదమైంది. అవుతూనే ఉంది.అన్నీంటికంటే ముఖ్యంగా తను మెగా స్టార్ ని, నందమూరి హీరోలని, వాడినట్టే పార్టీలను కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వాడేసుకుంటున్నాడనంటున్నారు.
డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, మొన్నటి వరకు ఎన్టీఆర్ అభిమానిగా విశ్వక్ సేన్, తన ప్రతీ మూవీ మీద నందమూరి స్టాంప్ వేశాడు. తర్వాత నటసింహం బాలయ్యని వాడేశాడు. నిజంగానే వాళ్ల మీద అభిమానం ఉండొచ్చు. వాళ్ల సపోర్ట్ తీసుకుని ఉండొచ్చు. కాని వరుసగా జరుగుతున్న సిచ్చువేషన్స్ చూస్తుంటే, బాలయ్య, ఎన్టీఆర్ ని వాడాక, ఇప్పుడు మెగాస్టార్ ని సాలిడ్ గా వాడేసిన విశ్వక్ సేన్ అన్నారు.
ఇప్పుడు జగన్ పార్టీని వాడేస్తున్నాడని అంటున్నారు. నిజానికి లైలా మూవీలో నటించిన ఫ్రుత్వి వేసిన డైలాగ్ వివాదమైంది. స్టేజ్ మీద తను చెప్పిన మాటలు, వైసీపీ ఫ్యాన్స్ మనసుకు తూటాల్లా తాకాయి. దీంతో బాయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ట్వీట్లు చేయటంతో, హీరో విశ్వక్ సేన్ వచ్చి సారి చెప్పాడు. తమ తప్పులేదని, ఎవరో చేసిన తప్పుకి తమ మూవీని బాయ్ కాట్ చేయొద్దని వేడుకున్నాడు.
ఇది బాగా వర్కవుట్ అయ్యింది. చాలా వరకు ఫ్రుత్వీ బదులు విశ్వకే సారీ చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టి వివరించటం చాలా వరకు లైలా మీద నెటెటీవిటీని తగ్గించాయి. కాకపోతే అసలు కమేడియనే సారి చెప్పాలనే మాటల దాడి మాత్రం ఇంకా ఆగట్లేదు. ఏదేమైనా చిరు, బాలయ్య, ఎన్టీఆర్ వల్ల ఈ సినిమాకు ఎంత మైలేజ్ వచ్చిందో… వైసీపీ ఫ్యాన్స్ వల్ల అంతకుమించి ప్రమోషన్ దక్కింది.విచిత్రం ఏంటంటే సీజన్ కో హీరో ని తన సినిమా ప్రమోషన్ కి తెగ వాడేస్తున్న విశ్వక్ సేన్, ఇలా ప్రెస్ మీట్ పెట్టి రిక్వెస్ట్ చేసి వైసీపీ ఫ్యాన్స్ ని కూల్ చేశాడటంటున్నారు. ఆ కోణం లో వాల్లని కూడా తెగ వాడేస్తున్నాడనే కామెంట్లు పెంచారు.