Gaami collections: కలెక్షన్ల వర్షం.. ‘గామి’ మూడు రోజుల కలెక్షన్స్..

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.96 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.69 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.46 కోట్ల షేర్ రాబట్టిన గామి.. మూడు రోజుల్లో రూ.6.11 కోట్ల షేర్ సాధించింది. చాలా రోజుల తర్వాత విశ్వక్సేన్‌కు ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2024 | 06:35 PMLast Updated on: Mar 11, 2024 | 6:35 PM

Vishwak Sens Gaami Box Office Collections Movie Runs Strong

Gaami collections: విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన అడ్వెంచర్ ఫిల్మ్ ‘గామి’. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. మంచి అంచనాలతో మార్చి 8న విడుదలైంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. త్వరలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.

Samantha : తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.96 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.69 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.46 కోట్ల షేర్ రాబట్టిన గామి.. మూడు రోజుల్లో రూ.6.11 కోట్ల షేర్ సాధించింది. ఏరియాల వారీగా చూస్తే మూడు రోజుల్లో నైజాంలో రూ.2.99 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.85 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.2.27 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రూ.70 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.2 కోట్ల షేర్ తో మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.8.81 కోట్ల షేర్ రాబట్టింది. రూ.10.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గామి.. వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు రూ.4.56 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.34 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.91 కోట్ల షేర్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.1.5 కోట్ల షేర్ రాబట్టాల్సింది ఉంది. మొదటి వారంలోనే ఈ సినిమా లాభాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా రోజుల తర్వాత విశ్వక్సేన్‌కు ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది.