Vishwambhara : విశ్వంభర కాన్సెప్ట్‌.. గూస్‌బంప్స్‌.. రికార్డ్‌ బ్రేకింగ్‌.. రాసుకోండ్రా అబ్బాయిలు..

గ్రాఫిక్స్‌.. విజువల్స్‌.. బీజీఎం(BGM) .. ఇది కదా చిరు రేంజ్ అనిపించేలా ఉంది విశ్వంభర (Vishwambhara) కాన్సెప్ట్‌ వీడియో. మెగాస్టార్ (Mega Star) హీరోగా.. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీపై.. అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 15, 2024 | 06:00 PMLast Updated on: Jan 15, 2024 | 6:00 PM

Vishwambhara Concept Goosebumps Record Breaking Rasukonda Boys

గ్రాఫిక్స్‌.. విజువల్స్‌.. బీజీఎం(BGM) .. ఇది కదా చిరు రేంజ్ అనిపించేలా ఉంది విశ్వంభర (Vishwambhara) కాన్సెప్ట్‌ వీడియో. మెగాస్టార్ (Mega Star) హీరోగా.. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీపై.. అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయ్. వాటికి ఏ మాత్రం తగ్గకుండా.. కాన్సెప్ట్‌ వీడియో అదుర్స్ అనిపించింది. మెగాస్టార్ కెరీర్‌లో 156వ మూవీగా సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీని.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఓ గ్రహంలో.. ఓ పెట్టెలో దాటిపెట్టిన రహస్యం.. ఆ గ్రహం దాటి భూమ్మీదకు వస్తే.. వచ్చి ఓపెన్ అయితే ఏం జరగబోతోంది.. ఎలా ఉండబోతుంది అన్నది స్టోరీ లైన్‌ అని క్లియర్‌గా అర్థం అవుతోంది.

రహస్యం దాచిపెట్టిన ఆ పెట్టే.. ట్రావెల్ చేసిన తీరు.. ఆ విజువల్స్ అదుర్స్ అనిపించాయ్. కక్ష్యలు దాటి.. ఉల్కలను ఢీకొట్టి.. భూమ్మీదకు ఎందుకొచ్చిందనే క్యూరియాసిటీ కనిపిస్తోంది కాన్సెప్ట్ వీడియో చూశాక. విజువల్స్ మాత్రం కేక పుట్టించాయ్ అంతే ! ఇక ఈ మూవీ మీద డైరెక్టర్‌ వశిష్ట క్రియేట్ చేస్తున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కెరీర్‌లో ఇది టాప్ 3లో ఉంటుందని.. భవిష్యత్తులో ఎప్పటికీ చెప్పుకునే గొప్ప చిత్రం అవుతుందని.. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఎవర్ గ్రీన్‌గా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చఅంటున్నాడు. బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత మెగాఆఫర్ కావడంతో.. వశిష్ట పక్కాగా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. ఇంకా హీరోయిన్లను ఫైనల్ చేసింది లేనిది చెప్పలేదు.

కీరవాణి(Keeravani) సంగీతం (Music) అందిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు.. చోటా కె నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం కేటాయించడం కోసం.. అక్టోబర్‌లోగా షూట్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసిన టీమ్‌.. 2025 సంక్రాంతికి కలుద్దాం అంటూ మూవీ విడుదల తేదిని ప్రకటించింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత.. మెగా ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. విశ్వంభర ఆ ఆకలి తీర్చడం ఖాయంగా కనిపిస్తోంది.