Vishwambhara : చిరు గడ్డం ర‌గ్గుడ్ లుక్‌లో విశ్వంభ‌ర..

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష (Trisha) హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ విశ్వంభ‌ర‌ (Vishwambhara) ..గతేడాది దసరా రోజు ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా రీసెంట్‌గా యాడ్ అయ్యింది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2024 | 02:47 PMLast Updated on: Feb 06, 2024 | 2:47 PM

Vishwambhara In A Short Beard Rugged Look

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష (Trisha) హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ విశ్వంభ‌ర‌ (Vishwambhara) ..గతేడాది దసరా రోజు ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా రీసెంట్‌గా యాడ్ అయ్యింది.. సోషియో ఫాంటసీ (Socio fantasy) అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఇది ముస్తాబవుతోన్న ఈ సినిమా.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బ‌డ్జెట్‌తో రూపొందుతోంది. దీని కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వైర‌ల్‌గా మారింది.

ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా డెబ్బై ఏళ్ల ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని.. పైగా చిరంజీవి రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది..ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర కూడా అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఈ సినిమాలో హైలైట్ అవుతుంది అని ఇప్పటికే దర్శకుడు వశిష్ట చెప్పుకొచ్చాడు. దీంతో.. ర‌గ్గుడ్ లుక్‌లో చిరు ఎలా ఉంటాడ‌న్న దానిపై ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక‌.. 2006లో విడుదలైన ‘స్టాలిన్‌’ (Stalin) లో చిరు-త్రిషల జోడి వినోదాన్ని పంచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించనున్నారు. దీంతో మెగా అభిమానులు సంబర పడుతున్నారు.. ఈ క్రమంలోనే రీసెంట్‌గా విశ్వంభ‌ర షూటింగ్‌లో జాయిన అయిన త్రిష‌కు టీమ్ నుంచి గ్రాండ్ వెల్‌క‌మ్ ల‌భించింది. ఇదిలా ఉంటే… విశ్వంభర కోసం చిరంజీవి ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మేకోవర్ ను మార్చుకునేందుకు జిమ్ లో చెమటలు చిందిస్తున్నారు మెగాస్టార్. మ‌రి విశ్వంభ‌ర‌గా చిరు ఎలాంటి సునామీ సృష్టిస్తాడో చూడాల్సిందే..