Viswambhara : విశ్వంభర’ లీక్… పెద్ద మనుషులు, పెద్ద చెవులు…

భోళా శంకర్ (Bhola Shankar) తర్వాత మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభ‌ర‌ (Vishwambhara). ఈ సినిమాతో దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 28, 2024 | 10:45 AMLast Updated on: May 28, 2024 | 10:45 AM

Vishwambhara Leak Big Men Big Ears

భోళా శంకర్ (Bhola Shankar) తర్వాత మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభ‌ర‌ (Vishwambhara). ఈ సినిమాతో దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష‌. బింబిసార ఫేమ్ మల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో సోషియో ఫాంట‌సీ డ్రామగా విశ్వంభర తెర‌కెక్కుతోంది. రీసెంట్‌గా ఆషికా రంగనాథ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టుగా అప్డేట్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలె.. హనుమంతుడి (Hanuman) బ్యాక్ డ్రాప్‌లో సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ షూట్ చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక సాలిడ్ లీకేజి బయటికొచ్చింది.

ఈ సినిమా కోసం సరికొత్త లోకం సృష్టించినట్లుగా తెలుస్తోంది. అందులో.. పెద్ద పెద్ద మనుషులు, వారికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయని అంటున్నారు. మనుషుల కంటే వాళ్ల ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుందట. అలాగే వారికి బారు చెవులు కూడా ఉంటాయట. ప్రజెంట్ దానికి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. అయితే.. టాలీవుడ్‌ సినిమాల్లో ఇప్పటి వరకు పెద్ద పెద్ద మనుషులను చూడలేదు. కానీ హాలీవుడ్ సినిమాల్లో మాత్రం చాలానే చూశాం. కానీ టాలీవుడ్‌ (Tollywood) లో మెగాస్టార్ సినిమాతో కొత్త మనుషులను క్రియేట్ చేస్తున్నారు. దీంతో.. విశ్వంభర పై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతునే ఉంది. ఈ సినిమాను యూవీ క్రియేటివ్స్ బ్యానర్ మీద, మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర రిలీజ్ కానుంది. మరి ఈ సోషియో ఫాంటసీ డ్రామా ఎలా ఉంటుందో చూడాలి