Chiru : ముల్లోకాలతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీల్లో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర మూవీ కూడా ఒకటి. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల తరహాలో చాలా కాలం తర్వాత మెగాస్టార్ నుంచి మళ్లీ అలాంటి సోషియో ఫాంటసీ మూవీ రాబోతోంది. ముల్లోకాలతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో డైరెక్టర్ వశిష్ఠ .. ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

Vishwambhara movie starring Megastar is one of the most awaited movies of Tollywood.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీల్లో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర మూవీ కూడా ఒకటి. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల తరహాలో చాలా కాలం తర్వాత మెగాస్టార్ నుంచి మళ్లీ అలాంటి సోషియో ఫాంటసీ మూవీ రాబోతోంది. ముల్లోకాలతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో డైరెక్టర్ వశిష్ఠ .. ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో చిరంజీవి మళ్ళీ ఒకప్పటి మెగాస్టార్ ని గుర్తు చేయబోతున్నాడనే టాక్ ఉంది ఇప్పటికే మూవీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ అన్నపూర్ణ 7 ఎకరాల్లో మూవీ కోసం భారీ సెట్ వేశారట. నెక్స్ట్ షెడ్యూల్ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
విశ్వంభర సినిమాను అత్యంత ఆసక్తికరమైన తారాగణంతో రూపొందిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమాలో మెగాస్టార్ జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మతో పాటు రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా మరో భామ విశ్వంభర టీంతో జాయిన్ అయింది.
అమిగోస్, నా సామిరంగ సినిమాల ఫేం ఆషికా రంగనాథ్.. విశ్వంభర టీంతో ఆషికా రంగనాథ్ ప్రయాణం మొదలుపెట్టబోతుంది. బ్లాక్ బస్టర్ ఎక్స్‌పీరియన్స్ కోసం సిద్దంగా ఉండండి.. అంటూ ఆషికా రంగనాథ్‌కు స్వాగతం పలుకుతూ షేర్ చేసిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గానే ఆషిక తాను ఈ భారీ ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈమె ఉన్నట్టుగా మేకర్స్ అధికారికంగానే చెప్పేసారు.. అయితే ఈ భామ విశ్వంభరలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.