vivo Y100: రంగులు మార్చే ముచ్చటైన మొబైల్స్..!
వివో సంస్ధ అందిస్తున్న సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్ vivo Y100.
సాధారణంగా మనం రంగులు మార్చే లోకాన్ని చూశాము. ఉన్నట్టుండి రంగులు మార్చే వాళ్ళను చూసి ఉంటాం. అందుకే ఊసరవెల్లి అని అప్పుడప్పుడూ పిలుస్తూ ఉంటారు. ఇటీవలె రంగులు మారే కార్లను కూడా చూశాం. అదే వింత అనుకున్నాం. ఇప్పడు రోజుకో కొత్త వింత పుంతలు తొక్కుతోంది. ఆధునికత మరీ విస్తరించి యువతను ఆకర్షించేందుకు సాంకేతికతపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం అలా వచ్చిన నూతన సాధనమే స్మార్ట్ ఫోన్.
రంగులు మార్చే టెక్నాలజీ:
వివో కంపెనీ నూతనంగా లాంచ్ చేసిన వై 100 స్మార్ట్ ఫోన్ రంగులను మారుస్తుంది. సాధారణ లైటింగ్లో ఉంచినప్పుడు లైట్ కలర్ లో ఉండు ఫోన్ వెనుక భాగం ప్యానెల్ వెలుగు పడిన వెంటనే డార్క్ రంగులోకి మారేలాగా రూపొందించారు. ఇందుకోసం ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ప్యానెల్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది. 64మెగాపిక్సల్ ఓఐఎస్ యాంటీ షేక్ కెమెరా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చూసేందుకు రిచ్ లుక్ తో అందరినీ ఆకర్షిస్తుంది. తక్కువ బరువుతో పసిఫిక్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, మెటల్ బ్లాక్ అనే మూడు సరికొత్త రంగుల్లో అందుబాటులో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
దీని ఫీచర్లు విషయానికొస్తే:
4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థాన్ని కలిగి ఉండి 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని అందిస్తుంది.
దీని సైజ్ విషయానికొస్తే 6.38 అంగుళా అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది.
ఫోన్ స్పేస్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది.
ఇది ఆండ్రాయిడ్ 13, ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
90 హెడ్జ్ రీఫ్రెష్ రేటుతో 7.73 ఎంఎం స్లీక్ బాడీ ఉంటుంది.
ఇక ధర విషయానికొస్తే రూ. 24,999 గా తెలిపింది.
5జీ టెక్నాలజీని కలిగిఉంది.
When change is the only constant, why stick to one color? Stay tuned for the Color Changing Glass Finish of vivo Y100. Stay tuned!
To know more, visit https://t.co/5bNAoMyRiK#vivoY100 #ItsMyStyle #ColorMyStyle#ComingSoon #5G pic.twitter.com/wmuhn2Wj5B
— vivo India (@Vivo_India) February 8, 2023
అన్నింటా అందుబాటులో:
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ స్టోర్లతో పాటూ, రిటైల్ అవుట్ లెట్లతో లభిస్తుందని పేర్కొంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు తెలిపింది. కోటక్ మహేంద్రా, హెచ్ డీ ఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్ బీ ఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకూ క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.