Kalki : కల్కి మేకర్స్‌తో దీపికాకు విబేధాలు
వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి సినిమాను నిర్మిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Vyjayanthi Movies banner is producing Kalki movie with a huge budget of around 600 crores.
వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి సినిమాను నిర్మిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా దీపికా పదుకోనె, దిశా పటాని నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న గ్రాండ్‌గా రీలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.
ముందుగా బుజ్జి అనే కారును ఇంట్రడ్యూస్ చేయడానికి భరీ ఈవెంట్ నిర్వహించారు. బుజ్జి కారుకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో ప్రత్యేకమని మేకర్స్ తెలిపారు. అయితే ఈ ఈవెంట్‌కి అమితాబ్, కమల్‌తో పాటు దిశా పటానీ కూడా అటెండ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎవరు రాలేదు. దీపికా పదుకోనే కూడా రాలేదు.
అయితే దీపిక రాకపోవడానికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని చెబుతున్నారు. ఈ ఈవెంట్‌కే కాదు, కల్కి ప్రమోషన్స్‌కు రానని దీపిక చెప్పినట్టుగా సమాచారం. సరే.. ఈవెంట్, ప్రమోషన్స్‌కి రాకపోయినా కనీసం సోషల్ మీడియాలో కల్కి గురించి చిన్న పోస్ట్ కూడా పెట్టడం లేదు దీపిక. దీంతో దీపికా తీరు పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు.. దీపిక ఇప్పటి వరకూ కల్కి గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం రెండు పోస్టులు మాత్రమే పెట్టింది. అది కూడా.. ఒకటి కల్కి మూవీ మొదలైనప్పుడు కాగా, రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే అయితే.. కొందరు మాత్రం ఈ విషయాన్ని మరోలా చూస్తున్నారు. కల్కి మేకర్స్‌తో ఏదైనా విబేధాలు వచ్చాయా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి దీపిక దీని పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.