Vyooham 2023 Release Date: వ్యూహం సినిమా రిలీజ్ ప్రకటించిన డైరెక్టర్ ఆర్జీవీ !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహం 2023 సినిమా సంచలనంగా మారబోతోంది. ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందని టాక్ నడుస్తున్న ఈ మూవీని ఆర్జీవీ డైరెక్ట్ చేశాడు. కోర్టు స్టేతో ఆగిన వ్యూహం 2023 సినిమాను ఈనెల 29న రిలీజ్ చేస్తామంటున్నాడు డైరెక్టర్ ఆర్జీవి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వ్యూహం 2023 సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఆ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (RGV). మొదట ఈ సినిమాను డిసెంబర్ 27న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే చంద్రబాబును కించపరిచేలా ఉందంటూ టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ కోర్టులో కేసు వేయడంతో ఆరోజున రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు డిసెంబర్ 29 నాడు రిలీజ్ చేస్తామని ప్రకటించారు ఆర్జీవి. సినిమా ఆపాలని ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తారని కామెంట్ చేశారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఇది సహజమే అన్నారు. వ్యూహం సినిమాను CBFC కూడా సర్టిఫై చేసిందన్నారు వర్మ. కోర్టు విచారణ రోజు తమ లాయర్లు ఆ రిపోర్ట్ ను కోర్టుకు అందిస్తారని చెప్పారు. ఇప్పుడు కోర్ట్ ఇచ్చింది జస్ట్ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేననీ… పూర్తి స్టే కాదన్నారు ఆర్జీవి. దీనిపై తమ అడ్వకేట్స్ మాట్లాడుతారని చెప్పారు.