Vyuham-Review : వర్మ.. మాకేంటి ఈ కర్మ
ఎన్నో వాయిదాల తర్వాత వ్యూహం చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. సెన్సార్ ఇష్యూస్ కావడంతో పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది.ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
ఎన్నో వాయిదాల తర్వాత వ్యూహం చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. సెన్సార్ ఇష్యూస్ కావడంతో పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది.ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
స్టోరీ విషయానికి వస్తే…
వియస్ వీరశేఖర రెడ్డి మరణంతో ఈ కథ మొదలవుతుంది. వియస్సార్ కొడుకు ‘వియస్ మదన్ మోహన్ రెడ్డి’ తన తండ్రి మరణం వార్త విని చనిపోయిన ప్రజల కోసం యాత్ర మొదలు పెడతాడు. అది ఇష్టం లేని ప్రతిపక్షాలు మదన్ పై కుట్రలు పన్నుతాయి. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మదన్ మోహన్ రెడ్డి పై సీబీఐ దాడులు ఎలా జరిగాయి, మదన్ అరెస్ట్ అయ్యి ఎలాంటి బాధలు అనుభవించాడు, ప్రతిపక్ష నేత ఇంద్రబాబును అన్నిరకాలుగా రాజకీయంగా ఎదుర్కొని మదన్ ఎన్నికల్లో ఎలా గెలిచి సీఎం అయ్యాడు , ఈ మధ్యలో మదన్ కి అతని భార్య వియస్ మాలతి రెడ్డి ఎలాంటి సపోర్ట్ అందించింది?, అలాగే ఈ మధ్యలో శ్రవణ్ పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ
పర్పామెన్స్ విషయానికి వస్తే…
వ్యూహం’ సినిమా ప్రారంభంలో కల్పిత కథ, పాత్రలతో తీశామని చెప్పినా సరే… కథ ఏమిటనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు. జగన్ మ్యానరిజాన్ని పర్‌ఫెక్ట్‌గా అజ్మల్ చూపించాడు.వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్ అయ్యారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ విభాగం..
‘వ్యూహం’ కథ ప్రేక్షకులకు తెలిసినదే. కథనం, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ, ఆర్టిస్టుల ఎంపికలో వర్మ మరోసారి పట్టు చూపించారు. నారా చంద్రబాబు, పవన్, చిరు, నాగబాబు, రోశయ్య, సోనియా తదితర పాత్రలకు ఆయా వ్యక్తుల రూపాన్ని పోలిన నటీనటుల్ని తెచ్చారు. ఇక చెప్పాలంటే రాంగోపాల్ వర్మ మార్క్ టెక్నిక్స్ కొన్ని ఈ సినిమాలో కనిపించాయి. మధ్య మధ్యలో పాటల్లో రాంగోపాల్ వర్మ కూడా గొంతు కలిపారు. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు సరిపోయింది. నిడివి కూడా రెండు గంటల ఒక నిమిషమే కావడం కాస్త కలిసొచ్చే అంశం. వైయస్సార్సీపి, రావాలి జగన్ కావాలి జగన్ రీమిక్స్ వంటి సాంగ్స్ వినడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది.. ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్క విధమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.
ఓవరాల్ గా చెప్పాలంటే… తెలిసిన కథనే… వర్మ తెర చూపించాడు. ‘యాత్ర 2’ చూసిన ప్రేక్షకులకు ‘వ్యూహం’ కథ, కథనాల్లో ఎంత మాత్రం కొత్తదనం కనిపించదు. రామ్ గోపాల్ వర్మ టార్గెట్ ఏమిటనేది ఈ సినిమా చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. నారా చంద్రబాబు – లోకేష్, చిరంజీవి – పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేలా రూపొందించిన సన్నివేశాల్ని తప్ప మరేమి లేవు. కోసమెరుపు ఎంటంటే… 2014 ఎన్నికల్లో తాను ఓడిపోతానని జగన్ మోహన్ రెడ్డికి తెలుసునని చెప్పడం ఆశ్చర్యాన్నికలిగిస్తోంది. అయితే… వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ వీరాభిమానులు విజిల్స్ వేసే మూమెంట్స్ సినిమాలో ఉన్నాయి. వాళ్లు హ్యాపీ థియేటర్లకు వెళ్ళవచ్చు. ఏదైమనా వ్యూహం సినిమా జగన్ అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్ నింపుతుందని చెప్పాలి.