2000 కోట్ల దేవర 2 కోసం వేయిటింగ్.. రూమర్స్ కి బ్రేక్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో జపాన్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు. అక్కడ ఒకే రోజు అరడజన్ ఔట్ ఫిట్స్ తో అందరినీ షేక్ చేస్తున్నాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో జపాన్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు. అక్కడ ఒకే రోజు అరడజన్ ఔట్ ఫిట్స్ తో అందరినీ షేక్ చేస్తున్నాడు. ఏకంగా 350 మంది ఫ్యాన్స్ ఉన్న థియేటర్ కి వెళ్లి అభిమానులడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. కొరటాల శివ కూడా దేవర 2 ని కన్ఫామ్ చేశాడు. బేసిగ్గా జపాన్ లో దేవర 2 ని ఫిల్మ్ టీం ఎనౌన్స్ చేస్తే ఇక రూమర్లకు బ్రేక్ పడాలి.. కాని అక్కడే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టేలోపే, జైలర్ ఫేం నెల్సన్ దిలీప్ ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ వచ్చేలా ఉంది. కథ సిద్దమైంది. ప్రొడక్షన్ హౌజ్ కూడా పావులు కదుపుతోంది. ఉగాది తర్వాత డ్రాగన్ సెట్లో తారక్ అడుగుపెట్టబోతున్నాడు. కాని ఆలోపే అంటే ఈనెల 31 లేదంటే ఏప్రిల్ 2క ఏదో పెద్ద ఎత్తునే ఎనౌన్స్ మెంట్ వచ్చేలా ఉంది. ఇదే పాత రూమర్స్ కి బ్రేక్ వేసి, కొత్త రూమర్లకు కారణమౌతోంది.. అదెలానో చూసేయండి.
దేవర పాన్ ఇండియాని షేక్ చేసి, జపానోల రిలీజ్ కాబోతోంది. ఇక్కడ 670 కోట్లు రాబట్టి, అక్కడ వసూల్ల వేట మొదలుపెట్టింది. బేసిగ్గా ఒక పాన్ ఇండియా మూవీ హిట్ అయ్యిందంటే, దాని సీక్వెల్ అంతకు రెండు మూడు రెట్లు వసూల్లు రావట్టే ఛాన్స్ ఎక్కువ. బాహుబలి 2 మూవీ 1850 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు, కేజీయఫ్ 2 మూవీ 1350 కోట్లు రాబట్టింది. కాబట్టే దేవర 2 ఈజీగా 2 వేల కోట్ల వసూళ్లు రాబడుతుందని అంచనాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవర 2 లోనే అసలైన కథ ఉందని దర్శకుడు తేల్చాడు. దేవర 1 ట్విస్ట్ కూడా పార్ట్ 2 లోనే తేలుతుంది కాబట్టి, దేవర 2 ఎంత త్వరగా వస్తే, అంతగా వసూళ్ల సునామీకి ఛాన్స్ ఉంది. కాని దేవర 2 విషయంలో కొంత కన్ ఫ్యూజర్ పెరిగింది. జపాన్ లో ఈమూవీని ప్రమోట్ చేస్తున్న ఎన్టీఆర్, కొరటాల శివ, ఇద్దరూ దేవర2 ఉందని తేల్చారు.
ఇది నిజంగా భారీ ఎనౌన్స్ మెంటే, కాని దేవర 2 ఉందన్నంత వరకు బానే ఉంది. కాని ఎప్పుడు మొదలౌతుందో మాత్రం తేల్చలేదు. కారణం సీన్ లోకి జైలర్ ఫేం నెల్సన్ దిలీప్ రావటమే. తనిప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ సీక్వెల్ తీస్తున్నాడు. అది హార్ట్ లీ దసరాలోపు షూటింగ్ పూర్తి చేసుకుంటుందట. సో డిసెంబర్ నుంచి ఎట్టిపరిస్థితుల్లో ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా పట్టాలెక్కించేందుకు నిర్మాత నాగ వంశీ వేగం పెంచాడు.
ఇక్కడే దేవర 2 విషయంలో కన్ ఫ్యూజన్ పెరుగుతోంది. కొరటాల శివ దేవర 2 కథ ఎప్పుడో సిద్ధం చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాడు. కాని ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రజెంట్ ఉగాది తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇది ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి రావటం పక్క అని ప్రొడక్షన్ టీం తేల్చింది.అలా చూస్తే డ్రాగన్ సంక్రాంతికి రావాలంటే, నవంబర్ లోగా షూటింగ్ పూర్తవ్వాలి. అదే జరిగితే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసే రాక్ స్టార్ సినిమా సెట్స్ పైకెళుతుంది. అదెప్పుడు పూర్తవుతుందో అటుంచితే, అదయ్యే వరకు దేవర 2 పట్టాలెక్కకపోతే ఇంత క్యూరియాసిటీ ఆవిరైపోతుంది. ఏదైనా వేడి మీదున్నప్పుడే దాడి చేయాలంటారు. సో దేవర ని డ్రాగన్ తర్వాత సెట్స్ పైకి తీసుకెళితేనే 670 కోట్ల సినిమాకు సీక్వెల్ వస్తే 2 వేల కోట్ల సీన్ వస్తుంది.. అక్కడే కొరటాల శివకి ఎన్టీఆర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితే కనిపించట్లేదు. ఏదేమైనా డ్రాగన్ షూటింగ్ సగం పూర్తయ్యే వరకు, నెక్ట్స్ దేవర 2 పట్టాలెక్కుతుందా? రాక్ స్టారే ముందు మొదలౌతుందా? తేలే ఛాన్స్ లేదు.