Megastar, Trivikram : మెగాస్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ను చూడాలని ఉంది..
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi)కి కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారం (Padma Vibhushan Award) ప్రకటించడంతో ఆయనకు సోషల్ మీడియా (Social Media) వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Want to see Megastar and Trivikram combination..
మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi)కి కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారం (Padma Vibhushan Award) ప్రకటించడంతో ఆయనకు సోషల్ మీడియా (Social Media) వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ పరిశ్రమలోని పలువురు దర్శక నిర్మాతలు, నటీనటులు చిరును నేరుగా కలిసి విష్ చేశారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), నిర్మాత చినబాబు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనను అభినందించడం సంలచలనమైంది.. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తికర చర్చకు తెర తీసారు..
చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే.. చిరును విష్ చేయడానికే త్రివిక్రమ్ ఆయన నివాసానికి వెళ్లినప్పటికీ.. వీరి భేటీపై మాత్రం ఇప్పుడు ఓ ఆసక్తికర డిస్కషన్ నడుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ గురూజీ – మెగాస్టార్ కాంబోలో సినిమా పడితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి గతంలోనే చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారన్న టాక్ వినిపించింది.. కానీ ఎందుకనో వీరి కాంబినేషన్ వర్క్ అవుట్ అవ్వలేదు. గతంలో మెగాస్టార్ నటించిన ‘జై చిరంజీవ’ సినిమాకి త్రివిక్రమ్ రైటర్ గా పని చేశారు. ఆ తర్వాత చిరంజీవితో గురూజీ సినిమా చేయాలనుకున్నారట.. కొన్నిసార్లు చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకో వీరి కాంబినేషన్లో సినిమా మాత్రం ఇప్పటికీ వర్కవుట్ కాలేదు.. అయితే ఇప్పుడు మెగా ఫాన్స్ వీరి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ మెగాస్టార్ నోట వస్తే అది స్క్రీన్‌పై ఎలా పేలుద్దో అని ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ పడితే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలవడం గ్యారెంటీ అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో నైనా ఈ కాంబో ఫ్యాన్స్ ఆశలు తీరుస్తుందో లేదో చూడాలి..