1000 మందితో ఫైట్… 2000 మందితో సాంగ్.. 1000 తలల తారక్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నమూవీ వార్ 2. ఈ సినిమా షూటింగ్ కథ కంచికి చేరి నెలగడుస్తోంది. కాని క్లైమాక్స్ షూటింగ్ మాత్రం నెలరోజులుగా నడుస్తూనే ఉంది. లాంగ్ షెడ్యూల్ పూర్తై, లాస్ట్ షెడ్యూల్ కి టైం వచ్చింది. ఈ సారి సెట్లో నటుల సంఖ్య వెలకు వేలు పెరిగిపోయేలా ఉంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నమూవీ వార్ 2. ఈ సినిమా షూటింగ్ కథ కంచికి చేరి నెలగడుస్తోంది. కాని క్లైమాక్స్ షూటింగ్ మాత్రం నెలరోజులుగా నడుస్తూనే ఉంది. లాంగ్ షెడ్యూల్ పూర్తై, లాస్ట్ షెడ్యూల్ కి టైం వచ్చింది. ఈ సారి సెట్లో నటుల సంఖ్య వెలకు వేలు పెరిగిపోయేలా ఉంది. ఇది నిజం.. ఆల్రెడీ 1000 మందితో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో చాలా వరకు షూటింగ్ పూర్తి చేసిన టీం, 2000 మంది డాన్సర్స్ తో అంతకుమించేలా సాంగ్ ని ప్లాన్ చేస్తోంది. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ తనకెరిర్ లో పదితలల రావణాసురుడిగా ప్రయోగం చేసిన ఇన్నాళ్లకు, పదివేల తలల రావణుడిగా మారే టైం వచ్చినట్టుంది. ఆ సీనే జనవరిలో పూర్తి చేసేందుకు వార్ 2 టీం గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. సో వార్ 2 మూవీ లో స్పెషల్ రోల్ నుంచి విలన్ వరకు, విలన్ నుంచి రావణాసురిడినే మించే వరకు తన పాత్ర పరిది పెరుక్కుంటూ పోతోందా? ఎప్పుడో పూర్తవ్వాల్సిన వార్2 ఇంకా కొనసాగటానికి ఎన్టీఆర్ ఇమేజే కారణమా?
వార్ 2 మూవీ మొదలైనప్పుడు ఇందులో ఎన్టీఆర్ పాత్ర కేవలం స్పెషల్ రోల్ మాత్రమే. ఎప్పుడైతే దేవర పాన్ ఇండియాను షేక్ చేసిందో… అప్పుటి నుంచి వార్2 లో ఎన్టీఆర్ పాత్ర పరిది పెరిగింది. లేదంటే ఎప్పుడో నవంబర్ లోనే తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తైందన్నారు. తర్వాత మళ్లీ ఎన్టీఆర్ పాత్ర పరిది పెంచి, వార్2 షూటింగ్ ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు
ఆల్రెడీ వార్2 లో 1000 మందితో ప్లాన్ చేసిన క్లైమాక్స్ ఫైట్ సీన్ 25 రోజులుగా తీస్తున్నారు. ఆలాంగ్ షెడ్యూల్ పూర్తైంది. కాని ఇంకా ఆ ఫైట్ సీక్వెన్స్ లో కొంత బ్యాలెన్స్ ఉందట. జనవరి ఎండ్ లోగా వార్ 2 తాలూకు టోటల్ యాక్షన్ పార్ట్, టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేయబోతున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ…
ఆతర్వాతే ఆల్రెడీ లాంచైన డ్రాగన్ సెట్లో కి ఎన్టీఆర్ అడుగుపెడతాడట. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి డ్రాగన్ షూటింగ్ తో బిజీ అవుతాడట. ఐతే జనవరిలో క్లైమాక్స్ పెండింగ్ యాక్షన్ సీక్వెన్స్ తోపాటు వార్ 3 సీక్వెల్ కి హింట్ ఇచ్చేఓ సీన్ ఉంటుందని తెలుస్తోంది.
క్లైమాక్స్ లో 1000 మంది ఎన్టీఆర్ లతో సీన్ ప్లాన్ చేశారట. జై లవకు శలో పది తల రావణుడిని ఒకే తలతో చూపించిన ఎన్టీఆర్, వార్ 2 క్లైమాక్స్ లో 1000 మంది తారక్ లుగా కనిపిస్తారట. ఇది గ్రాఫిక్స్ షాటా? లేదంటే ఎన్టీఆర్ ముఖాన్ని పోలిన మాస్క్ వేసుకుని వెయ్యిమంది ఫైట్ సీన్ లో ఉంటారో తేలేదు.
ఐతే ఇంతకుమించి సర్ ప్రైజ్ ఏంటంటే 2000 మంది తో కలిసి, ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ ఇద్దరూ డాన్స్ చేయబోతున్నారు. ఆ పాటని ఫిబ్రవరిలో ముంబై వాంఖెడే స్టేడియంలో షూటింగ్ చేయాలనకుంటున్నారని తెలుస్తోంది. ఇది వార్2 మూవీ ఎండ్ సాంగ్ లేదంటే, ప్రమోషనల్ సాంగ్ అని ప్రచారం జరుగుతోంది.