వారణాసిలో వార్ 2 టీజర్ లాంచ్… దేవర శాసించాడు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో, అంతా తనని ఫాలో అయ్యే రేంజ్ లో పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. దేవరతోనే ముందడుగు పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2024 | 01:19 PMLast Updated on: Nov 20, 2024 | 1:19 PM

War 2 Event At Varanasi

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో, అంతా తనని ఫాలో అయ్యే రేంజ్ లో పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. దేవరతోనే ముందడుగు పడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ కిముందు ట్రైలర్ ని ముంబైలోలాంచ్ చేసి నార్త్ ఇండియా నుంచే ప్రమోషన్ మొదలు పెట్టాడు. ఇప్పుడు కాశీలో కొత్త ట్రెండ్ కి రెడీ అయ్యాడు.

ఐతే ఎన్టీఆర్ ని చూసే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన గేమ్ ఛేంజర్ టీజర్ ని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లాంచ్ చేశాడు. వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుష్ప2 మూవీ తాలూకు ట్రైలర్ ని భీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేశాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంతవరకు ఏ బాలీవుడ్ హీరో కాని, హీరోయిన్ కాని వాల్ల సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లని ముంబైలో తప్ప మరో ప్లేస్ లో చేయలేదు

అలాంటిది ఎక్కడో సౌత్ ఇండియా నుంచి వచ్చి నార్త్ ఇండియాలోని ఉత్తర ప్రదేశ్, భీహార్, పంజాబ్, కాశీ అంటూ ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు,తమిళ సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లు చేస్తున్నారు. అదే నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి తెగ నచ్చింది. తమ సొంత హిందీ హీరోలే వాళ్ల నగరాలను, అక్కడి జనాలను పట్టించుకోలేదు.. అలాంటిది సౌత్ స్టార్లు నార్త్ కొచ్చి మరీ ఇలా ఈవెంట్లతో వాళ్లకి దగ్గరవ్వటం వాళ్లకి బాగా నచ్చినట్టుంది

ఈ విషయంలో మొదటి అడుగు బాహుబలితోనే మొదలైంది. కాని రెండో పెద్ద అడుగు మాత్రం మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే వేశాడు. ఎందుకంటే దేవర కోసం ముంబై, పంజాబ్ లో తను చేసినప్రమోషన్, అలానే ఈవెంట్లు నార్త్ ఇండియన్స్ కి తన సినిమాను మరింత దగ్గర చేశాయి. ఫలితంగా దేవర వసూళ్లు సౌత్ నే మించేలా నార్త్ లో వచ్చాయి.

అది చూశాక మిగతా స్టార్స్ ఊరుకుంటారా..? అందుకే గేమ్ ఛేంజర్ టీజర్ ఈవెంట్ ని లక్నోలో చరణ్ టీం ప్లాన్ చేయటం, టీజర్ ని లాంచ్ చేయటం జరిగింది. వెంటనే కంగువా టీం కూడా నార్త్ ఇండియాలోని చాలా సిటీల్లో భారీ ప్రమోషనల్ ఈవెంట్లు చేసింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంతొచ్చింది. తన పుష్ప2 మూవీ ప్రమోషన్ ని పాట్నాలో చేసి అచ్చుగుద్దినట్టు దేవర స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్.

కొన్ని విషయాలు మొదట్లో అద్భుతాలనిపించవు కాని, మొదటి అడుగు ఎఫెక్ట్ కొంతకాలానికి తెలిశాకే, ఆ అడుగు వేసిన వ్యక్తి స్ట్రాటజీ లోని గొప్పతనం బయట పడుతుంది. దేవర ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేసినప్పుడు, ఉత్తర ప్రదేవ్, పంజాబ్ లో ఎన్టీఆర్ ప్రమోషన్ చేసినప్పుడు అంతా కామెంట్ చేశారు. ఇప్పుడు బన్నీ, చరణ్, సూర్య అందరూ ఎన్టీఆర్ దారిలోనే నడవటం చూసి, మ్యాన్ ఆఫ్ మాసెస్ విజినరి అనేస్తున్నారు.