Jr NTR: ఎన్టీఆర్ లేకుండానే హిందీ మూవీ వార్ 2 షూటింగ్ షురూ..?

ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. మార్చ్ సెకండ్ వీక్ నుంచి హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడట. తనకు సంబంధించిన సీన్లు రెండు వారాలు తెరకెక్కించబోతున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 02:30 PMLast Updated on: Feb 16, 2024 | 2:30 PM

War 2 Shooting Starts Without Jr Ntr And With Hrithik Roshan

Jr NTR: ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా వార్ 2. హృతిక్, టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చి, భారీ వసూళ్లు రాబట్టిన వార్‌కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కబోతోంది. అలాంటి మూవీలో తారక్ విలన్‌గా కనిపిస్తాడంటే షాక్ అయ్యారు. కాని ఇప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే సాగుతోంది. అలాగని ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చాడా అంటే అదేం కాదు. తను ఈ సినిమాకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయినా ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం.

ALLU ARJUN-REVANTH REDDY: రేవంత్‌కు అల్లు అర్జున్ మద్దతు.. మామ కోసం ఏం చేయబోతున్నారంటే..

మార్చ్ సెకండ్ వీక్ నుంచి హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడట. తనకు సంబంధించిన సీన్లు రెండు వారాలు తెరకెక్కించబోతున్నారట. ఇక ఎన్టీఆర్ మాత్రం మార్చ్ ఎండ్ లేదంటే ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఇక హృతిక్, తారక్ కాంబినేషన్ సీన్లు మాత్రం జులైలో స్విట్జర్‌ల్యాండ్, జపాన్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రానుంది. యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించబోతుంది.

ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్ 1 పూర్తైన తర్వాత వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకుడు. జాన్వీ కపూర్ కథానాయిక.