డ్రాగన్ కొంపముంచేలా ఉన్న వార్ 2.. గాయాలతో పంచ్…

డ్రాగన్ మూవీ ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది. ఈనెలాఖర్లోగా సెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఇంతలో వార్ 2 సాంగ్ షూటింగ్ లో హ్రితిక్ కి గాయాలవ్వటంతో సండే షూటింగ్ సగంలోనే ఆగిందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 07:10 PMLast Updated on: Mar 12, 2025 | 7:10 PM

War 2 Which Is Like Biting A Dragons Horn Punch With Wounds

డ్రాగన్ మూవీ ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది. ఈనెలాఖర్లోగా సెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. ఇంతలో వార్ 2 సాంగ్ షూటింగ్ లో హ్రితిక్ కి గాయాలవ్వటంతో సండే షూటింగ్ సగంలోనే ఆగిందట. కాని అదేదో డాన్స్ ప్రాక్టీస్ లో హ్రితిక్ కి గాయాలయ్యాయని ప్రచారం మొదలైంది. నిజానికి సెట్లోనే అయిన గాయం వల్ల కేవలం అంటే కేవలం 5 నిమిషాల సాంగ్ లో లాస్ట్ 30 సెకన్స్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. అది కూడా మాంచి బీట్ ఉన్న సాంగ్ ఎండింగ్ కావటంతో, లాస్ట్ 30 సెకన్స్ షూటింగ్ బ్యాలెన్స్ ని వదిలేయలేరు… అందుకోసం మళ్లీ పెండింగ్ సాంగ్ షూటింగ్ ని ప్లాన్ చేయాలి.. ఆలోగా హ్రితిక్ రోషన్ కోలుకోవాలి… ఇది ఎన్టీఆర్ కి పెద్ద విషయం కాదు… తను మరో రెండు రోజులు డేట్లు ఇవ్వటానికి సిధ్ధం.. కాని వార్ 2 షూటింగ్ ఇలా అవటంతో, డ్రాగన్ కి పంచ్ పడేలా ఉంది. డ్రాగన్ రిలీజ్ డేట్ మీద కూడా ఎఫెక్ట్ కనిపించేలా ఉంది. రెండు రోజుల డిలే తో అంత ప్రమాధమేంటి? దాని ఎఫెక్ట్ ఎలా డ్రాగన్ మీద ఉండబోతోంది? హావేలుక్.

డ్రాగన్ మూవీ 2026 జనవరి లో వస్తుందనే అంచనాలతో షూటింగ్ మొదులు పెట్టారు. కాని హీరో సెట్లోకి రాలేదు. ఈ మంథ్ ఎండ్ కి వస్తాడనుకున్నారు. సండే రోజు కల్లా వార్ 2 హిందీ మూవీ పాట షూటింగ్ అయిపోవటంతో, ఇక వార్ 2 తో తారక్ కి సంబంధం లేదనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది.హిందీ మూవీ వార్ 2 సాంగ్ షూటింగ్ చివరి నిమిషంలో ఆగింది. 5 నిమిషల వరకు డ్యూరేషన్ ఉన్న సాంగ్ సండే వరకు షూటింగ్ జరుపుకుంది.

నాలుగు నిమిషాల ముప్పై సెకన్ల వరకు పాటని షూట్ చేశారు. మిగతా 30 సెకన్లు నాటు నాటు పాట చివర్లలో ఉన్నట్టు రఫ్పాడించే డాన్స్ మూవ్స్ ఉంటాయట. అవి చేసేప్పుుడే హ్రితిక్ రోషన్ కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. కాని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తనకి గాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆఖరి 30 సెకన్లు సండే రోజే తీయాలనుకుంటే, హ్రితిక్ కి గాయమవ్వటంతో ఆ చిన్న పార్ట్ ని వాయిదా వేశారు.మళ్లీ షూటింగ్ మొదలైతే, ఒక్క పూటలో ఆ సాంగ్ లో చివరి 30 సెకన్ల పాటని షూట్ చేస్తారు. తారక్ కూడా వచ్చి చేస్తా అన్నాడు. కాని ఇక్కడ అది సమస్య కాదు. హ్రితిక్ కి అరి కాలులో ఏయిర్ లైన్ ఫ్యాక్షర్స్ అయినట్టు తెలుస్తోంది.. అదే వార్ 2 మూవీకే కాదు ఎన్టీఆర్ డ్రాగన్ కి కూడా పంచ్ ఇచ్చే కారణమౌతోంది.

వార్ 2 మూవీ షూటింగ్ డిలే అయితే, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ 14 డేట్ మిస్ అయితే ఈ సినిమాని దసరాకో, దీపావళికో రిలీజ్ చేస్తారా అంటే, చాన్సేలేదు. ఆ డేట్లు బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలు బుక్ చేసుకున్నాయి. వార్ 2 మూవీకోసం వాల్లు వెనక్కి తగ్గినా ఆ డేట్ వార్ 2 కి పనికి రాదు..ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయాలనుకున్న వార్ 2, అప్పుడు రాకపోతే, జనవరి 26 కి ముందు రిపబ్లిక్ డే స్పెషల్ గా రావాలి..ఆలెక్కన వార్ 2 మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాకపోతే, జనవరి 26 కే విడుదలయ్యే ఛాన్స్ఉంది. అదే జరిగితే సంక్రాంతికి రావాల్సిన డ్రాగన్ సమ్మర్ కి లేదంటే, 2026 దసరాకే వాయిదా పడే ఛాన్స్ ఉంది. సో కేవలం 30 సెకన్ల పాట షూట్ ఆగిపోతే ఇంత డ్యామేజా అంటే, అక్కడే ట్విస్ట్ ఉంది. హ్రితిక్ అరికాల్లో ఏయిర్ లైన్ ఫ్యాక్ఛర్స్ అయ్యాయంటే, కేవలం 25 రోజుల బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు ఏయిర్ లైన్ ఫ్యాక్ఛర్స్ కాబట్టి, ఈజీగా రికవరి అవ్వొచ్చు..

కాని సమస్య అది కాదు, చేతికో, మరో చోటో ఏయిర్ లైన్ ఫ్యాక్షర్ పెద్ద మ్యాటర్ కాదు. కాని మనిషి బరువంతా మోసే అరికాలు, లేదంటే మడిమలో ఏయిర్ లైన్ ఫ్యాక్చర్ అయితే, అది 25 రోజుల్లో తగ్గినా లైట్ తీసుకోలేం. మళ్లీ వెంటనే డాన్స్ చేస్తే, అక్కడే ఎముక మరింత విరిగే ఛాన్స్ ఉంది. కాబ్టటి కనీసం రెండు నెల్ల వరకు హ్రితిక్ డాన్స్ చేయకూడదు.. కావాలంటే పెండింగ్ ప్యాచ్ వర్క్ చేయొచ్చు.. ఇదే నిజమైతే, వార్ 2 షూటింగ్ రెండు నెల్లు వాయిదా పడితే, ఆగస్ట్ 14 కి రావటం కష్టంఅదే జరిగితే, సంక్రాంతికి డ్రాగన్ రావటం కూడా అసాధ్యంగా మారుతుంది.